ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓట్స్‌తో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.

ABN, Publish Date - Jan 09 , 2024 | 11:47 AM

ఆరోగ్యంగా ఉండేందుకు మనం నిత్యం రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. వరి, గోధుమలతో పాటు ఓట్స్ ను కూడా తింటుంటాం.

ఆరోగ్యంగా ఉండేందుకు మనం నిత్యం రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. వరి, గోధుమలతో పాటు ఓట్స్ ను కూడా తింటుంటాం. అయితే.. ఓట్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఫైబర్ పేగు కదలికలను వేగవంతం చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడటంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కేలరీలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని కార్బోహైడ్రేట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు బ్యాలెన్సింగ్ గా ఉంచుతుంది. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలుంటాయంటున్నారు నిపుణులు.

గుండె ఆరోగ్యానికి...

ఓట్ మీల్ లోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను సానుకూలంగా ప్రభావితం చేయడంలో సహకరిస్తుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును స్థిరీకరిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హైపర్‌టెన్షన్, సంబంధిత కార్డియోవాస్కులర్ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడతుంది. శరీరం నుంచి టాక్సిన్స్, వ్యర్థాలను తొలగిస్తుంది.


బాదంతో కలిపి తీసుకుంటే..

ఇందులోని జింక్, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. ఓట్స్ ను బాదంపప్పుతో కలిపి తినడం వల్ల మరింత ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రొటీన్, జింక్‌తో సహా 15 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి వ్యాధులకు ఇది చక్కగా ఉపయోగపడుతుందని వివరించారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 12:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising