Garlic: వెల్లుల్లి కొంటున్నారా? అయితే జాగ్రత్త.. ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో తెలిస్తే కళ్లు తేలెయ్యాల్సిందే..!
ABN, Publish Date - Aug 20 , 2024 | 01:44 PM
మనం ప్రతిరోజూ వాడే నిత్యావసర వస్తువులు నకిలీవో, కావో తెలుసుకోవడం చాలా కష్టం. వీటిని కొనడం వల్ల ఆర్థికపరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఇంతకుముందు నకిలీ కోడిగుడ్లు, నకిలీ బియ్యం, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, నకిలీ కారం మొదలైనవి మార్కెట్లోకి వచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్నాయి.
మనం ప్రతిరోజూ వాడే నిత్యావసర వస్తువులు నకిలీవో (Fake), కావో తెలుసుకోవడం చాలా కష్టం. వీటిని కొనడం వల్ల ఆర్థికపరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఇంతకుముందు నకిలీ కోడిగుడ్లు, నకిలీ బియ్యం, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, నకిలీ కారం మొదలైనవి మార్కెట్లోకి వచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి వెల్లుల్లి (Garlic) కూడా చేరిపోయింది. ప్రస్తతుం వెల్లుల్లి ధరలు బాగా పెరిగిపోయాయి. దీంతో నకిలీ రాయుళ్లు రంగంలోకి దిగారు (Viral Video).
మహారాష్ట్రకు చెందిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సుభాష్ పాటిల్ ఈ నకిలీ వెల్లుల్లి (Fake garlic)కి సంబంధించిన సంచలన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అకోలాలోని బజోరియాకు చెందిన సుభాష్ పాటిల్ భార్య కొన్ని రోజుల క్రితం తన ఇంటి ముందుకు వచ్చిన వ్యాపారి వద్ద వెల్లుల్లి పాయలు కొనుగోలు చేశారు. వంట చేద్దామని వెల్లుల్లి పాయలను తీయగా అవి చాలా గట్టిగా అనిపించాయి. చాకుతో కోసినా తెగలేదు. తర్వాత పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఆ వెల్లుల్లి పాయలను సిమెంట్‌తో తయారు చేశారు. సిమెంట్‌కు కాస్త తెలుపు కలర్ కలిపి ఆ వెల్లుల్లి పాయలను తయారు చేశారు.
ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సుభాష్ పాటిల్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలోని వెల్లుల్లి పాయలు చూడానికి నిజమైన వాటిలాగానే ఉన్నాయి. వాటిని కోసి పై పొర తీసి చూస్తే లోపల సిమెంట్ ముద్దలు ఉన్నాయి. వెల్లుల్లి పై పొర మాత్రం అలాగే ఉంచి, లోపల అంతా సిమెంట్ వేసి అమ్మేస్తున్నారు. వెల్లుల్లి కొనేవారు జాగ్రత్తగా చూసి కొనండి అంటూ సుభాష్ హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఎంతో మంది షేర్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: రోడ్డు మీద బైకర్‌కు షాకింగ్ అనుభవం.. ఓ ఎద్దు ఎలా చుక్కలు చూపించిందో చూడండి..!
Viral Video: స్థంభంపై ఇరుక్కుపోయిన జాతీయ జెండా.. మెరుపులా వచ్చిన పక్షి ఏం చేసిందో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 20 , 2024 | 01:44 PM