ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇదెక్కడి గొడవరా నాయనా.. కుర్చీ కోసం కొట్టుకున్నారు

ABN, Publish Date - Oct 31 , 2024 | 10:07 AM

కుర్చీల కోసం రెండు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. సదరు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ ఘటన జరిగింది.

ఇస్లామాబాద్‌: 'బలగం' సినిమాలో నల్లి బొక్కల కోసం బంధువులు గొడవ పడిన సీన్ చూశాం. అప్పుడప్పుడు బంధువుల మధ్య కూడా వాగ్వాదం జరుగుతుంటుంది. చిన్న చిన్న విషయాలకు గొడవ పడే సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. కానీ ఇక్కడ గొడవ జరిగింది బంధువుల మధ్య కాదు. రెండు వేర్వేరు కుటుంబాల మధ్య. కుర్చీల కోసం రెండు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. సదరు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ ఘటన జరిగింది. అక్టోబర్‌ 27న ఖయాబాన్-ఎ-సహర్‌లోని ఒక రెస్టారెంట్‌లో రెండు కుటుంబాల వారు పక్కపక్కనే కూర్చున్నారు. కుర్చీలు ఖాళీ లేకపోవడంతో కొందరు నిలబడి ఉన్నారు.


కొందరు మహిళలు లేచి వెళ్లడంతో ఖాళీ అయిన కుర్చీని ఓ మహిళ తీసుకుంది. దీంతో అక్కడున్న వారు పరస్పరం వాగ్వాదానికి దిగారు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చినికి చినికి గాలి వానలా మారింది. అలా.. వారి కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. రెస్టారెంట్లో దొరికిన వాటిని దొరికినట్లుగా విసిరుకున్నారు. చెంపలపై పిడి గుద్దులు కురిపించుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అయితే రెస్టారెంట్ యాజమాన్యం, సిబ్బంది జోక్యంతో ఇరు వర్గాలు శాంతించాయి. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఇరు పక్షాలు రాజీపడ్డాయి. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

Diwali 2024: రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: రేవంత్, కేసీఆర్

Devotional: మెట్టినింటికి వెళ్లిన సోదరి కోసం ఓ పండుగ..

Updated Date - Oct 31 , 2024 | 10:08 AM