ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బైకుపై దుప్పటి కప్పుకొని వెళ్తున్న వ్యక్తి.. తీరా సమీపానికి వెళ్లి అతడి వెనుక చూడగా.. షాకింగ్ సీన్..

ABN, Publish Date - Jan 05 , 2024 | 09:21 PM

ఓ వ్యక్తి దుప్పటి కప్పుకొని బైకుపై వెళ్తున్నాడు. అయితే వెనుకే వెళ్తున్న వారు.. సమీపానికి వెళ్లి అతడి వెనుక చూసి షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు...

ప్రస్తుతం ఎక్కడ చూసిన చలి తీవ్రత విపరీతంగా ఉంది. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రంగా మరింత ఎక్కువగా ఉంది. దీంతో ఉదయం సూర్యుడు వచ్చే వరకూ ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జనం ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఒక వేళ బయటికి వెళ్లాల్సి వస్తే అనేక రకాల జాగ్రత్తలు తీసుకుని మరీ వెళ్తున్నారు. చలి తీవ్రతను కళ్లకు కట్టినట్లు చూపే అనేక రకాల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి దుప్పటి కప్పుకొని బైకుపై వెళ్తున్నాడు. అయితే వెనుకే వెళ్తున్న వారు.. సమీపానికి వెళ్లి అతడి వెనుక చూసి షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి దుప్పటి కుప్పుకొని బైకుపై వెళ్తున్నాడు. అయితే కారులో అతడి వెనుకే వెళ్తున్న వారికి ఏదో సందేహం వచ్చింది. దీంతో బైకు సమీపానికి వెళ్లి అతడి వెనుక గమనించగా.. ఓ పిల్లాడు కూర్చుని ఉన్నాడు. తండ్రి తన కొడుకును చలి నుంచి రక్షించేందుకు దుప్పటి కప్పినట్లు తెలిసింది. తన కొడుకు ఎక్కడ కిందపడిపోతాడో అనే భయంతో ఓ చేత్తో పిల్లాడిని పట్టుకుని, మరో చేత్తో బైకు నడుపుతున్నాడు.

Viral Video: రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి చుట్టేసిన పొగమంచు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

తాను ఇబ్బంది పడినా పర్లేదు.. తన కొడుకు బాగుండాలి.. అను అనుకుని ఈ తండ్రి తీసుకున్న జాగ్రత్తలు చూసి అంతా భావేద్వేగానికి గురయ్యారు. తండ్రి ప్రేమకు అద్దం పట్టేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు కూడా చలించిపోయారు. దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తండ్రి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘అంత చలిలో రాత్రి వేళ.. చిన్న పిల్లలను తీసుకెళ్లవద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అర్ధరాత్రి మద్యం మత్తులో కారు ఎక్కిన యువతి.. చివరకు డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు ఏమంటున్నారంటే..

Updated Date - Jan 05 , 2024 | 09:21 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising