Viral: డబ్బున్న వాళ్లను పట్టడం ఎలా? టిప్స్ చెబుతూ ఏకంగా రూ.162 కోట్లు సంపాదించిన లవ్ గురూ..!
ABN, Publish Date - Jul 16 , 2024 | 09:41 AM
ధనవంతులు కావాలని, విలాసవంతమైన జీవితం అనుభవించాలని ఎవరు కోరుకోరు? కోట్లు సంపాదించాలనే కోరికతో కొందరు రకరకాల పద్ధతులను ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు తరచుగా లాటరీ టిక్కెట్లను కొంటారు. వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలని కొందరు అనుకుంటారు.
ధనవంతులు (Rich) కావాలని, విలాసవంతమైన జీవితం అనుభవించాలని ఎవరు కోరుకోరు? కోట్లు సంపాదించాలనే కోరికతో కొందరు రకరకాల పద్ధతులను ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు తరచుగా లాటరీ టిక్కెట్లను కొంటారు. వ్యాపారం చేసి కోట్లు (Big Money) సంపాదించాలని కొందరు అనుకుంటారు. మరికొందరు తమ ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టి డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తారు. చైనా (China)కు చెందిన ఓ మహిళ అలాంటి అద్భుతమైన ట్రిక్‌తో కోట్లు సంపాదిస్తోంది. చైనీస్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె.. ధనవంతులైన పురుషులను పెళ్లి చేసుకోవడం ఎలా? అనే విషయంలో సలహాలు ఇస్తుంటుంది (Viral News).
చైనాకు చెందిన ఆ ఇన్ఫ్లుయెన్సర్ పేరు లీ చువాంకు (Le Chuanqu). చైనాలో ఆమె వివాదాస్పద లవ్ గురు (Love Guru)గా ప్రఖ్యాతి పొందింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమె వివాహ సంబంధాలు, ఆర్థిక సలహాలను అందిస్తుంటుంది. ``కికు బిగ్ ఉమెన్`` పేరుతో ప్రసిద్ధి పొందిన ఈమెకు సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈమె వివాహాన్ని, బంధాలను ఆర్థిక లాభాలు సంపాదించే సాధనాలుగా చూస్తుంది. తన ఫాలోవర్లకు కూడా అవే సలహాలు ఇస్తుంది. ``ఏ బంధమైనా ప్రాథమికంగా ఏదో ప్రయోజనాన్ని నెరవేర్చాలి. ఏ బంధమైనా మీ స్థాయిని పెంచడానికి, మిమ్మల్ని మరింత శక్తివంతం చేయడానికి ఉపయోగపడాలి`` అని ఆమె చెబుతుంటుంది.
ఈ విషయంలో ప్రైవేట్ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు నెలకు 1,400 డాలర్లు (రూ. 1,16,927) వసూలు చేస్తుంది. సోషల్ మీడియాలో అనేక వర్క్‌షాప్‌లు, సెమినార్లను కూడా నిర్వహిస్తుంది. ఎంతో మంది ఫాలోవర్లు ఆమెకు భారీ ఫీజులు చెల్లించి విలువైన సలహాలు తీసుకుంటారు. ఇలా ఫీజుల ద్వారా చువాంక్ ఏకంగా రూ.162 కోట్లు సంపాదించింది. ఆమె బోధనలు వివాదాస్పదం కావడంతో చైనా స్థానిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ``వీబో`` ఆమెను నిషేధించింది. దీంతో ఆమె స్వంతంగా ఓ వ్యక్తిగత ఛానెల్‌ను ప్రారంభించి కస్టమర్లతో నేరుగా మాట్లాడుకుంటోంది.
ఇవి కూడా చదవండి..
Viral: వరద వస్తుందని ముందు జాగ్రత్త.. రూ.45 వేలు ఖర్చు పెట్టి మరీ ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి..!
Word Puzzle: ఈ పజిల్‌లోని అక్షరాల మధ్య ఓ పదం దాక్కుంది.. 6 సెకెన్లలో దానిని కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 16 , 2024 | 09:41 AM