Viral: ఇదెక్కడి విడ్డూరం.. తలలో పేను ఉందని విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే..
ABN, Publish Date - Aug 05 , 2024 | 08:10 PM
వాతావరణం బాగా లేకపోయినా, ప్రయాణికులు ఎవరైనా అస్వస్థతకు గురైనా, లేదా ఏదైనా ఇతర భద్రతా కారణాల వల్ల విమానాలను దారి మళ్లించడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే తాజాగా అమెరికాలో ఓ విమానాన్ని ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారో తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం.
వాతావరణం బాగా లేకపోయినా, ప్రయాణికులు ఎవరైనా అస్వస్థతకు గురైనా, లేదా ఏదైనా ఇతర భద్రతా కారణాల వల్ల విమానాలను (Flight) దారి మళ్లించడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే తాజాగా అమెరికాలో ఓ విమానాన్ని ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) చేశారో తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం. ఓ ప్రయాణికురాలి తలలో ఉన్న పేను (Lice)ను చూసి భయపడి అమెరికా (America) ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని అత్యవసరంగా దించేశారు. జూన్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది (Viral News).
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్‌కు వెళ్తోంది. ఆ సమయంలో ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని తోటి ప్రయాణికురాలు గుర్తించింది. దానిని ఓ బగ్‌గా భావించిన సదరు ప్రయాణికురాలు వెంటనే విమాన సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. కారణం ఏంటో కనుక్కోకుండానే విమానాన్ని ఫీనిక్స్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వారందరికీ హోటల్ సదుపాయం కల్పించారు.
ఆ విమానాన్ని దాదాపు 12 గంటల పాటు విమానాశ్రయంలోనే ఉంచేశారు. ఆ విమానంలో ఉన్న ఎతాన్ జుడెల్సన్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ద్వారా ఆ ఘటన గురించి వెల్లడించడంతో తాజాగా బయటకు వచ్చింది. ఈ ఘటన గురించి విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ విమాన సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 05 , 2024 | 08:10 PM