ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ముక్కులోంచి ఆగకుండా కారుతున్న రక్తం.. పేషెంట్‌‌ను చూసిన డాక్టర్లకే షాక్! చివరకు..

ABN, Publish Date - Feb 23 , 2024 | 08:08 PM

ముక్కులోంచి ఆగకుండా రక్త కారుతున్న ఓ వ్యక్తిని పరీక్షించిన వైద్యులే దిమ్మెరపోయారు. ఇలాక్కూడా జరుగుతుందా అని నోరెళ్లబెట్టారు.

ఇంటర్నెట్ డెస్క్: ముక్కులోంచి ఆగకుండా రక్త కారుతున్న ఓ వ్యక్తిని పరీక్షించిన వైద్యులే దిమ్మెరపోయారు. ఇలాక్కూడా జరుగుతుందా అని నోరెళ్లబెట్టారు. ఈ అసాధారణ ఘటన అమెరికాలోని (USA) వెలుగు చూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి గత అక్టోబర్‌లో ముక్కులోంచి రక్తం కారడం మొదలైంది (Florida Man with Nose Bleed). మొదట్లో అప్పుడప్పుడూ రక్తస్రావమయ్యేది. ఆ తరువాత సమస్య తీవ్రత క్రమంగా పెరిగింది.

ఫిబ్రవరి 7న అతడి సమస్య ఊహించని మలుపు తిరిగింది. అతడి ముక్కులోంచి ఆగకుండా రక్తస్రావం కావడంతో పాటు ముక్కూ, పెదాలు వాచిపోయాయి. అతడి పరిస్థితి చూసి షాకైపోయిన డాక్టర్లు వెంటనే పలు పరీక్షలు నిర్వహించారు. రక్తస్రావానికి కారణం తెలిసి మరింత షాకైపోయారు. అతడి ముక్కుతో పాటూ సైనస్ ఖాళీల్లో జెర్రెల్లాంటి సుమారు 150 పురుగులు గూడుకట్టుకుని ఉంటున్నాయి. అక్కడున్న కండను తింటూ మలినాలను విసర్జిస్తూ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యాయి. అందులోని కొన్ని పురుగులు మనిషి చిటికెన వేలంత కూడా ఉన్నాయి (Docs find worms Growing in sinuses).

Illegal Trading: ఇంటి నుంచే పని చేస్తున్న భార్య.. ఆమె తన కోలీగ్స్‌తో ఫోన్లో మాట్లాడుతుంటే సీక్రెట్‌గా విని..


సంక్షిష్టమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు డాక్టర్లు వెంటనే రంగంలోకి దిగారు. ముక్కులోంచి పురుగులను ఒక్కొక్కటిగా మొత్తం తొలగించారు. అక్కడి మృతకణజాలం అంతా తొలగించి యాంటీ పారసైటిక్ మందులు వేశారు. ఇదే పరిస్థితి మరింత కాలం కొనసాగి ఉంటే ప్రాణాంతకమై ఉండేదని వైద్యులు చెప్పారు.

Tea: సాల్ట్ టీ గురించి విన్నారా? రోజూ టీలో చిటికెడు ఉప్పు వేసుకుంటే..

రోగి సమస్య గురించి వైద్యులు పలు కీలక విషయాలు వెల్లడించారు. రోగికి సుమారు 30 ఏళ్ల క్రితం ముక్కులో క్యాన్సర్ వచ్చింది. అప్పట్లో వైద్యులు నాశికారంధ్రంలోంచి కొంత భాగాన్ని తొలగించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అది చివరకు ఇన్ఫెక్షన్‌కు అనుకూల పరిస్థితులను కల్పించింది. ఇదిలా ఉంటే అక్టోబర్‌లో రోగి.. చేపలు వేట సందర్భంగా నదిలోనే చేతులు కడుక్కున్నాడు. అతడి నిర్లక్ష్యం కారణంగా చేతులపై ఉన్న క్రిములు ముక్కులోకి ప్రవేశించాయి. అప్పటికే అక్కడ ఇన్ఫెక్షన్‌కు అనుకూల వాతావరణం ఉండటంతో పురుగులు పెరడం ప్రారంభించి రక్తస్రావానికి దారి తీశాయి. ప్రస్తుతం ఆ రోగికి యాంటీపారసైటిక్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్టు వైద్యులు తెలిపారు. క్రమంగా కోలుకుంటున్నాడని అన్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 24 , 2024 | 06:25 PM

Advertising
Advertising