ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Life Partner: పెళ్లికి ముందు మీ జీవిత భాగస్వామిని మెప్పించే సులభమైన చిట్కాలు..

ABN, Publish Date - Oct 01 , 2024 | 07:41 AM

ఇద్దరి మధ్య బంధం బలోపేతం కావడానికి ప్రయత్నిస్తుంటారు. తమకు కాబోయే భాగస్వామి నుంచి అవతలి వ్యక్తులు ఎన్నో ఆశిస్తుంటారు. తాము ఊహించుకున్న లక్షణాలు తాము పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ప్రేమ వివాహల్లో ..

Life Partner

జీవిత భాగస్వామిని ఎంచుకోవడం మరిచిపోలేని అనుభూతి. కొందరు ప్రేమించడం ద్వారా తమ భాగస్వామిని ఎంపిక చేసుకుంటే.. మరికొందరు బంధువుల్లో ఒకరిని భాగస్వామిగా ఎంచుకుంటారు. మరికొందరు పెద్దలు కుదిర్చిన సంబంధాలను చూసి ఇష్టమైన వ్యక్తులను భాగస్వామిగా ఎంచుకుంటారు. ఎవరైనా ఒకరిని తమ జీవితంలోకి ఆహ్వానించాలని నిర్ణయించుకున్న తర్వాత.. ఇద్దరి మధ్య బంధం బలోపేతం కావడానికి ప్రయత్నిస్తుంటారు. తమకు కాబోయే భాగస్వామి నుంచి అవతలి వ్యక్తులు ఎన్నో ఆశిస్తుంటారు. తాము ఊహించుకున్న లక్షణాలు తాము పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ప్రేమ వివాహల్లో అయితే పెళ్లికి కొద్ది నెలల ముందునుంచే ఇద్దరు ప్రేమించుకోవడం ద్వారా ఒకరి అభిరుచులు మరొకరికి తెలుస్తాయి. అవసరమైతే ఒకరి కోసం మరొకరు తమ అలవాట్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. పెద్దల కుదిర్చిన పెళ్లిలకు సంబంధించి సమయం తక్కువుగా ఉంటుంది. దీంతో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ ఉన్న తక్కువ సమయంలోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ జీవిత భాగస్వామిని మీరు మెప్పించే అవకాశం ఉంటుంది. కొంతమంది తమ భాగస్వామిని మెప్పించడం కోసం అవతలి వ్యక్తులను మనసును నొప్పించే పనులు చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో చాలా జాగ్రత్త అవసరం. మనం చేసే పని వివాహం చేసుకోబోయే వ్యక్తిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదనే విషయాన్ని గుర్తించుకోవాలి. పెళ్లికి ముందే భాగస్వామి మనసును నొప్పిస్తే ఇద్దరి మధ్య బంధం బలపడటానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు. లేదంటే తీవ్రంగా మనసు నొచ్చుకుంటే వివాహం చేసుకోవడానికి ముందుకు రాకపోవచ్చు. జీవిత భాగస్వామి మనసు బాధ పడకుండా వారిని మెప్పించే చిట్కాలు తెలుసుకుందాం.

Viral Video: వామ్మో.. పాములను కంట్రోల్ చేస్తున్న రింగ్ మాస్టర్.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇష్టాలను తెలుసుకోండి..

మొదటి దశలో మీ జీవిత భాగస్వామి ఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ ఇష్టాలను షేర్ చేసుకోండి. పెళ్లికి ముందే ఒకరి ఇష్టాలను మరొకరు పంచుకోవడం ద్వారా ఒకరిపై మరొకరికి నమ్మకం ఏర్పడుతుంది. రెండో దశలో మీ జీవితంలో ముఖ్య ఘట్టాలను పంచుకోండి. మీరు జీవిత భాగస్వామికి ఆ వ్యక్తిని ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను వివరించండి. అవతలి వ్యక్తిలో మీకు నచ్చని అంశాలు ఉంటే వెంటనే స్పందించి మీ అభిప్రాయాన్ని చెప్పొద్దు. ఆమె లేదా అతడిలో మీకు నచ్చని అంశాలను నెమ్మదిగా అర్థం చేయించే ప్రయత్నం చేయాలి. వాటి ద్వారా కలిగే నష్టాలను వివరిస్తే మనసు నొప్పించకుండా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

Lifestyle: ఈ టిప్స్‌తో మీరు ఇష్టపడే అమ్మాయితో మాటలు కలపండి..


స్వేచ్ఛ విషయంలో..

మీ జీవిత భాగస్వామిపై మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అదే సమయంలో పెళ్లికి ముందు పరిమితులు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అతిగా ప్రవర్తించడం ద్వారా మీ వ్యవహారంపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. మీరు చేసే పని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు.

IRTC: భారతీయ రైల్వే అదిరిపోయే ఆఫర్.. టికెట్లు ఇలా బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ టికెట్‌పై భారీ తగ్గింపు..


బహుమతుల విషయంలో..

ముఖ్యంగా జీవిత భాగస్వామికి ఇచ్చే బహుమతులు చాలా విలువైనవనే విషయాన్ని గుర్తించుకోవాలి. బహుమతి చిన్నాదా.. పెద్దదా, ధర ఎంత అనే దానికంటే మీరు ఇచ్చే బహుమతి జీవితాంతం గుర్తించుకునేదై ఉండాలి. ఆ బహుమతిలో ఏదైనా ప్రత్యేకత ఉండేలా చూసుకోండి. మీరు ఇచ్చే గిఫ్ట్ చూడగానే ఆమె జీవితంలో అనుభూతులు గుర్తొచ్చేదిగా ఉంటే మీపై ప్రేమ, అభిమానం పెరగడంతో పాటు.. నమ్మకం పెరుగుతుంది. మనసును నొప్పించే బహుమతులను అసలు ఇవ్వొద్దు.

Viral Video: మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..


మర్యాదగా ప్రవర్తించండి..

మీ జీవిత భాగస్వామితో పాటు వారి తల్లిదండ్రుల పట్ల మర్యాదగా ప్రవర్తించండి. వారిని గౌరవించడం ద్వారా మీపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. పెళ్లికి ముందు అనవసరమైన గొప్పలకు పోవడం ద్వారా మీపై అంచనాలు భారీగా పెరుగుతాయి. పెళ్లైన తర్వాత ఆ అంచనాలను మీరు అందుకోకపోతే అది మీ జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మన ఆర్థిక స్థోమత, సామర్థ్యం విషయాలలో వాస్తవాలను ముందుంచే ప్రయత్నం చేయాలి. లేనిపోని గొప్పలు చెప్పుకోవడం ద్వారా మీపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న చిట్కాలు పాటించడం ద్వారా మీరు పెళ్లికి ముందే మీ భాగస్వామిని మెప్పించేందుకు అవకాశం ఉంటుంది.


Save Money: బస్సు టికెట్లు ఇలా బుక్ చేసుకుంటే మీ డబ్బు ఆదా చేసుకోవచ్చు.. లేదంటే మీరు మోసపోయినట్లే

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 01 , 2024 | 07:41 AM