ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lifestyle: ఈ టిప్స్‌తో మీరు ఇష్టపడే అమ్మాయితో మాటలు కలపండి..

ABN, Publish Date - Sep 30 , 2024 | 08:30 PM

తాము ఇష్టపడే వ్యక్తులతో మాటలు కలపడం కోసమే కొందరు నెలలు తరబడి వేచి చూస్తుంటారు. ఏదో ఒక రకంగా మాట కలిపితే తరువాత ప్రేమను వ్యక్తం చేయవచ్చనే ఆలోచనతో కాలయాపన చేస్తారు. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నా.. ఆ ఇద్దరు తమ ఇష్టాన్ని బయటకు వ్యక్తం చేయడానికి..

Friendship Tips

ప్రేమలో సఫలమయ్యే వాళ్లు కొందరైతే.. విఫలమయ్యేవాళ్లు మరికొందరు.. ప్రేమను తమలోనే ఉంచుకుని జీవితాంతం బాధపడేవాళ్లు మరికొందరు. తమలోని ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఏళ్ల తరబడి వేచి చూసేవాళ్లు మరికొందరు. సాధారణంగా ఎవరైనా ఒక అమ్మాయిని అబ్బాయి.. లేదా అబ్బాయిని అమ్మాయి ఇష్టపడుతుంటారు. కానీ తాము ఇష్టపడే వ్యక్తులకు తమ ఇష్టాన్ని ఎలా తెలియజేయాలి.. సంభాషణను ఎలా ప్రారంభించాలో తెలీదు. తాము ఇష్టపడే వ్యక్తులతో మాటలు కలపడం కోసమే కొందరు నెలలు తరబడి వేచి చూస్తుంటారు. ఏదో ఒక రకంగా మాట కలిపితే తరువాత ప్రేమను వ్యక్తం చేయవచ్చనే ఆలోచనతో కాలయాపన చేస్తారు. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నా.. ఆ ఇద్దరు తమ ఇష్టాన్ని బయటకు వ్యక్తం చేయడానికి సంకోచిస్తారు. దీంతో అబ్బాయి, అమ్మాయి మధ్య మాటలు కలవడానికి ఎంతో సమయం తీసుకుంటారు. అటువంటి వారు తాము ఇష్టపడే వ్యక్తులతో సంభాషణను ప్రారంభించడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

Viral Video: మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..


ముందుగా ఒత్తిడి..

ఇష్టపడుతున్న ఒక అమ్మాయితో మాట కలపడానికి ముందు సాధారణంగా కొంత ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి కారణంగా ఒక వ్యక్తి తనలో తాను మదనపడుతుంటాడు. ఒక్కోసారి ఒత్తిడి కారణంగా తన వ్యవహారశైలితో అవతలి వ్యక్తిని ఇబ్బందిపెట్టే అవకాశం లేకపోలేదు. అందుకే ముందుగా ఒత్తిడి నుంచి బయటపడాలి. తాను ఇష్టపడుతున్న వ్యక్తి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎలాంటి వ్యవహారశైలిని అవతలి వ్యక్తులు ఇష్టపడతారనేది తెలుసుకుంటే.. వారిని ఇబ్బందిపెట్టే పనులు చేయకుండా జాగ్రత్తపడటానికి అవకాశం ఉంటుంది.

IRTC: భారతీయ రైల్వే అదిరిపోయే ఆఫర్.. టికెట్లు ఇలా బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ టికెట్‌పై భారీ తగ్గింపు..


అభినందనలతో..

మనం ఇష్టపడే వ్యక్తులతో మాట కలపడానికి ముందుగా వారితో పరిచయం ఏర్పరచుకోండి.. వారు మీ ఆఫీసులో పని చేసేవారైనా, కాలేజీలో ఫ్రెండ్ అయినా.. ముందుగా మిమల్ని మీరు పరిచయం చేసుకునే ప్రయత్నం చేయండి. అదే సమయంలో ఆమెను గౌరవించే ప్రయత్నం చేయండి. అగౌరవంగా, అమర్యాదగా ప్రవర్తించవద్దు. ఆమె అందంగా ఉందని ప్రశంసించవచ్చు. లేదా ఆమె కళ్లు లేదా వస్త్రదారణపై పాజిటివ్ కామెంట్ చేయవచ్చు. అదే సమయంలో అతిగా ప్రవర్తించవద్దు. మొదటి పరిచయంతోనే ఆమె వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు. హద్దులను మీరకుండా ఆమెను అభినందించే ప్రయత్నం చేయడం ద్వారా మీరు స్నేహాన్ని ప్రారంభించవచ్చు.

Tourism: తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు.. ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్


సర్వసాధారణంగా..

మీరు ఇష్టపడే వ్యక్తిని పలకరించడం కోసం ప్రత్యేకమైన సందర్భాలు ఏమి అవసరం లేదు. కనిపించినప్పుడు హాయ్, హాలో అని సాధారణంగా పలకరించవచ్చు. పలకరింపులో ఆప్యాయత చూపించాలి. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ అనేది చాలా అవసరం. బలవంతంగా పలకరిస్తున్నామనే భావన అవతలివారిలో కలగకుండా చూసుకోవాలి. ఒక్కోసారి హాయ్, హాలో అనే పలకరింపు కూడా ఆమెతో మీ స్నేహాబంధాన్ని బలోపేతం చేస్తుంది.

Tour Plans:దసరా సెలవులకు లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవైతే బెస్ట్


ఈ విషయాలు గుర్తించుకోండి..

మొదటి పరిచయంతోనే ఓ వ్యక్తితో అతిగా ప్రవర్తించే ప్రయత్నం చేయకూడదు. ఓ అమ్మాయి లేదా అబ్బాయి మీవైపు ఆకర్షితులవ్వాలంటే వారి అభిరుచులకు తగినట్లు మీరు ఉన్నారనే భావం కలిగించాలి. మోసం చేయాలనే ఆలోచన మనసులో రాకూడదు. ఓ వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నా.. అవతలి వ్యక్తి మిమల్ని ఇష్టపడాలని లేదు. ముఖ్యంగా మీరు ఇష్టపడే వ్యక్తి మనసును మెప్పించడం కోసం ప్రయత్నించాలి. ఒకసారి ఆమె మనసు మిమల్ని ఇష్టపడితే మీ ఇద్దరి మధ్య స్నేహం బలపడి.. అది ప్రేమగా మారే అవకాశం ఉంటుంది. ఇష్టం పేరుతో మీరు అతిగా ప్రవర్తిస్తే అది మీ ఇద్దరి మధ్య తగదాలకు దారితీయవచ్చు.

నోట్: ఇది కేవలం కొంతమంది నిపుణుల అభిప్రాయాల మేరకు ఇచ్చిన కథనం మాత్రమే.

Viral: రాత్రి 2.00 గంటలకు బాస్ నుంచి ఊహించని మెసేజ్! మహిళకు షాక్!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 30 , 2024 | 08:30 PM