Viral: ఇలాక్కూడా జరుగుతుందా? ఫ్రెండ్ జాక్‌పాట్ చూసి లాటరీ టిక్కెట్ కొంటే..
ABN, Publish Date - Jun 13 , 2024 | 03:35 PM
ఫ్రెండ్‌కు లాటరీ తగిలిందని తెలిసి ఓ టిక్కెట్ కొన్న వ్యక్తికి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఫ్రెండ్ కంటే ఎన్నో రెట్లు అధికంగా డబ్బు దక్కడంతో అతడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: లైఫ్ లో అదృష్టదేవత ఎప్పుడు ఎలా కరుణిస్తుందో చెప్పడం కష్టం. చేయాల్సిందల్లా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి సరిగ్గా ఇదే చేశాడు. స్నేహితుడి లక్ చూసి ఆశ్చర్యపోయిన అతడు తనకూ అలాంటి అదృష్టం పట్టాలని కోరుకుంటూ లాటరీ టిక్కెట్టు కొన్నాడు. చివరకు అతడు అనుకున్నదే జరగడంతో లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. రాత్రికి రాత్రి ధనవంతుడైపోయి లైఫ్‌లో సెటిల్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ ఉదంతం తెగ వైరల్ (Viral) అవుతోంది.
Viral: ఈమె అసలు మనిషేనా? మరీ ఇంత పైశాచికత్వమా!
నార్త్ కెరొలీనాకు చెందిన మెల్విన్ బ్రూక్స్ ఇటీవల తన ఫ్రెండ్ లాటరీ గెలవడం చూశాడు. చిన్న లాటరీ టిక్కెట్టుతో అతడు రూ.8వేలు గెలుచుకున్నాడని ఫేస్‌బుక్‌లో పోస్టు చూసి ఆశ్చర్యపోయాడు. తనూ ఇలాగే లాటరీ టిక్కెట్టు కొంటే అదృష్టం కలిసి రావచ్చని అనుకున్నాడు. ఈ క్రమంలో అతడు రూ.400 పెట్టి (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) ఓ టిక్కెట్ కొన్నాడు. శనివారం నాడు మెల్విన్ మౌంట్ హాలీలోని ఓ పార్కింగ్ లాట్‌లో తను కొన్న టిక్కెట్‌ను స్క్రాచ్ చేసి చూడగా అతడు ఒక్కసారిగా షాకైపోయాడు. కారణం.. లాటరీలో అతడికి ఏకంగా రూ.33 కోట్లు దక్కడమే (Friends Win Inspires US Man To Try His Luck In Lottery The Result Is Rs 33 Crore Jackpot).
ఒక్కసారి అంత డబ్బు తనకు దక్కడంతో అతడి ఆనందానికి అంతేలేకుండా పోయింది. రాష్ట్ర, కేంద్ర పన్నులు పోను అతడికి దాదాపు 2.85 లక్షల డాలర్లు దక్కాయి. ఇందులో కొంత మొత్తంతో ఇంటిమీదున్న అప్పు తీర్చేసి మిగతా మొత్తాన్ని భార్య, బిడ్డలతో కలిసి పంచుకుంటానని అతడు చెప్పాడు. ఇది అరుదుగా మాత్రమే జరిగే ఘటన అని, ఈ లాటరీ దక్కినందుకు తాను ఎల్లప్పుడూ దేవుడికి రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు.
కాగా, అంతకుముందు, అమెరికాకు చెందిన మరో వ్యక్తి లాటరీలో ఏకంగా ఏడు వేల కోట్లు పొందాడు. పవర్ బాల్ జాక్ పాట్ దక్కించుకున్న అతడు ఒక్కసారిగా అపరకుబేరుడైపోయాడు. నూతన సంవత్సరం తొలి రోజే గుడ్ న్యూస్ రావడంతో అతడి ఆనందానికి అంతేలేకుండా పోయింది.
Updated Date - Jun 13 , 2024 | 03:40 PM