ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. చీమ కూడా ఇంతలా భయపెడుతుందా? జర్మన్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Sep 27 , 2024 | 02:46 PM

జర్మనీకి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ తాజాగా తీసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఇవాన్ జివ్‌కోవిక్ తీసిన ఆ ఫొటో చీమ శరీరానికి సంబంధించిన ప్రతి డిటైల్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

amazing picture of ant

జర్మనీకి (Germany) చెందిన ఓ ఫొటోగ్రాఫర్ (Photographer) తాజాగా తీసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఇవాన్ జివ్‌కోవిక్ ( Ivan Zivkovic) తీసిన ఆ ఫొటో చీమ (Ant) శరీరానికి సంబంధించిన ప్రతి డిటైల్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కీటకాల క్లోజప్ షాట్‌లు తీయడంలో ఎంతో ప్రతిభ కలిగిన జివ్‌కోవిక్ తాజా ఫొటో మరింత వైరల్ అవుతోంది. izimacro అనే తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియోను పోస్ట్ చేశాడు (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. జివ్‌కోవిక్ మాక్రో లెన్స్‌తో కూడిన కెమెరాను పట్టుకుని, చెక్క దుంగపై ఉన్న చీమను జూమ్ చేసి ఫొటో తీయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఫొటో అనంతరం ఆ చీమ పాకురుకుంటూ వెళ్లిపోయింది. అయితే జివ్‌కోవిక్ తీసిన ఫొటో మాత్రం అద్భుతంగా ఉంది. ఆ ఫొటోలో చీమ కళ్లు, నోరు, ముక్కుతో సహా దాని మొహం అత్యంత స్పష్టంగా కనిపించింది. ``నేను ఇంతకు ముందు చీమలను ఫోటో తీయలేదు. కానీ ప్రతిదానికీ ప్రారంభం ఉంటుంది. చీమలు నిశ్శబ్దంగా కూర్చోవడం నేను ఎప్పుడూ చూడలేదు.`` అంటూ జివ్‌కోవిక్ పేర్కొన్నాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు. 23 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చీమ కళ్లు చాలా భయానకం``, ``మాక్రో ఫొటోగ్రఫీ.. నిజంగా అద్భుతం``, ``ఆ చీమ నేరుగా లెన్స్‌లోకి చూస్తున్నట్లు అనిపిస్తుంది``, ``వామ్మో.. చీమ కూడా ఇంతలా భయపెడుతుందా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: 5 రూపాయలతో 50 కిలోమీటర్లు.. బీహార్ కుర్రాడు తయారు చేసిన ఈ వెరైటీ బైక్ స్పెషాలిటీ ఏంటంటే..


Viral Video: తెలివంటే ఇదీ.. బైక్ ఇంజిన్, ఫ్యాన్‌తో వినూత్న వాహనం.. గాల్లోకి ఎగిరే చౌకైన విహంగం..


Viral Video: వావ్.. హిప్పోలు కూడా ఇంత బుద్ధిగా ఉంటాయా? పళ్లు తోముతుంటే హిప్పో ఏం చేసిందో చూడండి..


Viral News: 11 సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చాడు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..


Picture Puzzle: మీరు పజిల్ స్పెషలిస్టులా?.. ఈ వర్డ్ పజిల్‌లోని ``IRON``ను 8 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Sep 27 , 2024 | 02:46 PM