Viral: పిల్లల్లో దేవుడు ఉంటాడనేది ఇందుకే! వీడియో చూసి నెటిజన్ల కంట కన్నీరు!
ABN, Publish Date - Dec 09 , 2024 | 09:47 PM
చిన్నారులకు ఎంత దొడ్డమనసు ఉంటుంటో చెప్పే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ జనాలతో కనీళ్లు పెట్టిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: కల్మషమే తెలీని చిన్నారుల మనసులు మేలిమి బంగారాలు! అందుకే చిన్నారులను దేవుడితో పోలుస్తారు. తమ ఎదురుగా ఎవరైనా బాధపడుతుంటే చిన్నారులు తట్టుకోలేరు. తమకు చేతనైన మేరకు వారిని ఊరడించే ప్రయత్నం చేస్తారు. తమ చేతిలో ఉన్నదేదో వారి చేతుల్లో పెట్టి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తారు. ఇక పెంపుడు జంతువుల పట్ల చిన్నారులకు ఉండే ఆపేక్ష అంతా ఇంతా కాదు. వాటికేమైనా అయితే పసిహృదయాలు తట్టుకోలేవు. చిన్నారులకు ఎంత దొడ్డమనసు ఉంటుంటో చెప్పే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ జనాలతో కన్నీళ్లు పెట్టిస్తోంది. వీడియోలోని పసిపాప మంచితనం అనేక మందిని కదిలిస్తోంది. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది (Viral).
Viral: వీటిల్ని షూస్ అంటారా? ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ పిల్లి పిల్ల చలికి తట్టుకోలేక మరణం అంచులకు చేరుకుంది. అచేతన స్థితికి చేరుకుంది. అప్పటివరకూ తనతో ఆడుకున్న పిల్లి పిల్ల అలా పడిపోవడంతో ఓ చిన్నారి తట్టుకోలేక పోయింది. వలవలా ఏడ్చేసింది. పిల్లిని ఎలాగైనా కాపాడాలన్న తలంపుతో హెయిర్ డ్రయ్యర్‌తో వేడి గాలిని పిల్లిపిల్లపై ప్రసరిస్తూ దాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. అది కదలకపోవడం చూసి చిన్నారి గుండెలు ద్రవించేలా ఏడ్చింది. కానీ, పసిమనసును కష్టపెట్టడం దేవుడికి కూడా ఇష్టం లేదేమో కానీ చిన్నారి ప్రయత్నాలు ఫలించాయి. చలి నుంచి మెల్లగా బయటపడ్డ పిల్లిపిల్ల క్రమంగా కోలుకుంది. ఆ తరువాత దానిముందు పెట్టిన పాలను కూడా తాగింది.
Viral: దేవుడా! ఈ ఒక్క ప్రశ్నకు యస్ చెప్పినందుకు 100 మంది ఉద్యోగులకు ఊస్టింగ్!
ఇక వీడియోలో ఇదంతా చూసిన జనాలు.. కల్మషం లేని చిన్నారి మనసు చూసి మురిసిపోతున్నారు. ఇంతటి సహృదయం ఉండే చిన్నారులు నిజంగా దేవుడితో సమానమని కొందరు కామెంట్ చేశారు. అవతలి వారి బాధకు ప్రతిస్పిందించేలా చిన్నారిని పెంచిపెద్ద చేస్తున్న తల్లిదండ్రులను కూడా కొందరు ప్రశంసించారు. ఆ చిన్నారి పెరిగి పెద్దయ్యాక కూడా ఇలాగే ఉండాలని కొందరు ఆకాంక్షించారు. లోకం తీరును చూసి ఆమెలో కాఠిన్యం పెరగకూడదని కోరుకున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది. జనాలను కదిలిస్తోంది.
Viral: బ్యాంకు మేనేజర్ దగా! లోన్ ఆశ పెట్టి రూ.39 వేల నాటు కోళ్లు స్వాహా!l
Updated Date - Dec 09 , 2024 | 09:53 PM