ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Watch Video: యువకుడి ఒడిలో అమ్మాయి.. ఏం చేశారంటే

ABN, Publish Date - Sep 25 , 2024 | 02:16 PM

యువతలో మార్పు వస్తోంది. ఎడ్యుకేషన్, కెరీర్ అని కాకుండా ట్రెండింగ్ అయ్యేందుకు చూస్తున్నారు. బైక్‌ల మీద స్టంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఓ జంట రెచ్చి పోయింది.

Girl On Lap Of Man

హైదరాబాద్: కల్చరో.. లేదంటే కాలమో తెలియడం లేదు. యువత ప్రవర్తన మితిమీరుతోంది. సమాజం అంటే కొందరు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రేమలో ఉన్నామని తెలిసేందుకు ఇలా చేస్తున్నారో.. కావాలనే చేస్తున్నారో తెలియడం లేదు. బైక్ ముందు అమ్మాయిలను కూర్చొబెట్టుకొని రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ కల్చర్ ఢిల్లీ, ముంబైలో ఉండేది. ఆ వీడియోలు మనం చూశాం. ఇప్పుడు భాగ్యనగరంలో ఆ సీన్ కనిపిస్తోంది. పాతబస్తీ పహాడీ షరీఫ్ మెయిన్ రోడ్డులో ఓ జంట బైక్ మీద ఇలా విన్యాసాలు చేసింది.


హైదరాబాద్‌లో ఇలా

ఢిల్లీ, నోయిడాలో టూ వీలర్ మీద అమ్మాయి, అబ్బాయి ఒడిలో కూర్చొని వెళ్లడం చూశాం. ఐటీ హబ్ బెంగళూరులో కూడా జంటలు హత్తుకొని కనిపించారు. ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చినట్టుంది. పహాడీ షరీఫ్ ప్రధాన రహదారిలో ఓ యువకుడు బైక్ నడిపిస్తున్నాడు. ముందట యువతిని కూర్చొబెట్టుకొని వెళుతున్నాడు. ఆ యువతి అతడిని హత్తుకొని ఉంది. వారిద్దరూ అలా వెళ్తుండగాన్ని ఒకరు వీడియో తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల కామెంట్లతో ఆ పోస్ట్ బాక్స్ నిండుతోంది.



బాధ్యత లేదా..

ఆ యువకుడి టూ వీలర్ పక్కనే మరో జంట సింపుల్‌గా వెలుతున్నారు. మరొకరు ఆ జంట వెనకాల వచ్చే విజువల్ వీడియోలో చూడొచ్చు. ఇన్నాళ్లు సిటీలో ఇలాంటి విజువల్ కనిపించలేదు. ట్రెండ్.. లేదంటే ఇతర చోట్ల జరిగిన వీడియోల ప్రభావమో ఏమో కానీ ఆ జంట కూడా ట్రై చేసినట్టుంది. వారిద్దరి తీరును నెటిజన్లు ఖండిస్తున్నారు. అలా వెళ్లడంతో ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు..? కాస్త అయినా బాధ్యతగా ఉండొద్దా అని ప్రశ్నిస్తున్నారు. ఆ జంటను పోలీసులు గుర్తించాల్సి ఉంది.


రానీ మార్పు

సోషల్ మీడియా వల్ల యువత ఆలోచనల విధానంలో మార్పు వచ్చింది. ట్రెండ్ ఫాలో అవుతున్నామని చెప్పేందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. యువత ఆలోచన విధానంలో మార్పు రావాలని మానసిక నిపుణులు కోరుతున్నారు. ఎడ్యుకేషన్, కెరీర్ టార్గెట్ పెట్టుకోవాలే తప్ప.. ఇలా వీడియోల కోసం, ట్రెండ్ అయ్యేందుకు ప్రవర్తించడం సరికాదని సూచించారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: హీరో కార్తీకి పవన్ కల్యాణ్ వార్నింగ్

Tirumala Laddu Controversy: పొన్నవోలు, ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పవన్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 25 , 2024 | 06:22 PM