ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. కొండచిలువతో ఆటలాడిన యువతి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN, Publish Date - Aug 25 , 2024 | 10:25 AM

పాము కళ్ల ముందుకు వస్తే గజగజ వణుకుతూ అక్కడి నుంచి పారిపోయే వారు చాలా మంది ఉంటారు. పామును చూస్తే చాలు.. చాలా మందికి ప్రాణం పోయినంత పనవుతుంది. ఇక, కొండచిలువ పేరు వింటే చాలు భయం మొదలవుతుంది. అలాంటిది ఓ యువతి పొలంలో కనపించిన కొండచిలువతో ఆటలాడింది.

Girl Tries To Catch A Python

పాము (Snake) కళ్ల ముందుకు వస్తే గజగజ వణుకుతూ అక్కడి నుంచి పారిపోయే వారు చాలా మంది ఉంటారు. పామును చూస్తే చాలు.. చాలా మందికి ప్రాణం పోయినంత పనవుతుంది. ఇక, కొండచిలువ (Python) పేరు వింటే చాలు భయం మొదలవుతుంది. అలాంటిది ఓ యువతి పొలంలో కనపించిన కొండచిలువతో ఆటలాడింది. దానిని ఒట్టి చేతులతో పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కొండచిలువ అంత సులభంగా చిక్కలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


aartiyadav7082 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి పొలంలో ఉంది. అదే సమయంలో ఆమెకు అక్కడ ఓ కొండచిలువ కనిపించింది. బురదలో నుంచి పాకురుకుంటూ వెళ్లిపోతోంది. ఆ కొండచిలువను ఆ యువతి ధైర్యంగా పట్టుకుంది. దాని తోక పట్టుకుని లాగడానికి ప్రయత్నించింది. దీంతో కొండ చిలువ వెనక్కి తిరిగి ఆ యువతిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు.


ఈ వైరల్ వీడియోకు కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 12 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ప్రతి ఒక్కరికీ ఈ స్థాయి కాన్ఫిడెన్స్‌ అవసరం``, ``గ్రామాల్లో, పొలాల్లో పని చేసే వారు నిత్యం పోరాడుతూనే ఉంటారు``, ``ఆ అమ్మాయి ధైర్యానికి హ్యాట్సాఫ్``, ``ఆమెను చూసి కొండచిలువ భయపడి పారిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. 10 సెకెన్లలో ఈ ఫొటోలోని ``Friends``ని కనిపెట్టండి..!


Viral Video: వామ్మో.. ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. కింగ్ కోబ్రా భయంకర రూపం చూస్తే నివ్వెరపోవాల్సిందే..!


Viral: ఛీ..ఛీ.. మార్చురీలో ఇదేం పని.. 75 శవాల మధ్య అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన జంట.. వీడియో తీస్తున్నా..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 25 , 2024 | 10:25 AM

Advertising
Advertising
<