Glowing Skin: మెరిసే చర్మం కావాలంటే ఈ 5 విటమిన్లు తీసుకోండి చాలు..!
ABN, Publish Date - Jul 02 , 2024 | 04:43 PM
ముఖ చర్మం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే నేటి కాలపు జీవనశైలికి, ఆహారపు అలవాట్లకు, వాతావరణ కాలుష్యానికి ఇది అంత సులువుగా సాధ్యం కాదు. అయితే 5 రకాల విటమిన్లను ప్రతి రోజూ తీసుకుంటూ ఉంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుందట.
ముఖ చర్మం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే నేటి కాలపు జీవనశైలికి, ఆహారపు అలవాట్లకు, వాతావరణ కాలుష్యానికి ఇది అంత సులువుగా సాధ్యం కాదు. అయితే 5 రకాల విటమిన్లను ప్రతి రోజూ తీసుకుంటూ ఉంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుందట. ఈ విటమిన్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతివంతంగా ఉండేందుకు సహాయపడతాయి. ఆ విటమిన్లు ఏంటో తెలుసుకుంటే..
విటమిన్-ఎ..
విటమిన్-ఎ కణాల ఉత్పత్తి, కణాల పెరుగుదలకు చాలా సహాయపడతుంది. ఇది చర్మ కణజాలాన్ని మరమ్మత్తు చేయడంలో కూడా సహాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ముఖం మీద ముడుతలు, గీతలు తగ్గించి వృద్దాప్య సంకేతాలు తగ్గిస్తుంది.
Sri Lanka Oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ శ్రీలంక ఆయిల్ వాడాల్సిందే.. దీన్నెలా తయారుచెయ్యాలంటే..!
విటమిన్-సి..
శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లలో విటమిన్-సి ప్రధానమైనది. విటమిన్-సి UV కిరణాల కారణంగా, కాలుష్యం కారణంగా ఏర్పడే ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది కొల్లాజెన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది. చర్మం స్థితిస్థాపకత, దృడత్వాన్ని పెంచుతుంది.
విటమిన్-ఇ..
విటమిన్-సి లాగే విటమిన్-ఇ కూడా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మం రంగును మెరుగుపరుస్తుంది. చర్మం మీద ముడతలు, రంధ్రాలు, గీతలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా కాంతివంతంగా ఉంచుతుంది.
కలోంజి విత్తనాలను తేనెతో కలిపి తింటే జరిగేదేంటి?
విటమిన్-డి..
ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి విటమిన్-డి చాలా అవసరం. ఇది చర్మ కణాల పెరుగుదల, మరమ్మత్తులో పనిచేస్తుంది. అదే విధంగా సూర్యరశ్మి నుండి చర్మం దెబ్బతినకుండా రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
విటమిన్- బి..
విటమిన్-బి లిస్ట్ లో బి1, బి2, బి3, బి5 చర్మానికి చాలా అవసరం. ఇవి అన్నీ చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. చర్మపు రంగును ప్రోత్సహిస్తాయి. బి విటమిన్లు చర్మం హైడ్రేట్ గా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తాయి. మొటిమలు, పొడిచర్మం నుండి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మం కాంతివంతంగా మెరిపోవడానికి ఇవి చాలా అవసరం.
రోజూ ఏలకుల నీటిని తాగుతుంటే ఏం జరుగుతుందంటే..!
Papaya: జాగ్రత్త.. బొప్పాయిని ఈ ఆహారాలతో కలిపి అసలు తినకూడదు..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 02 , 2024 | 04:44 PM