Viral Video: ఎంత అమానుషం.. వృద్ధురాలిని బ్యాట్‌తో కొట్టిన మనవడు.. వీడియో చూస్తే కన్నీళ్లు రాక మానవు..
ABN, Publish Date - Nov 09 , 2024 | 07:05 AM
చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల కంటే అమ్మమ్మ, నాన్నమ్మలతోనే ఎక్కువ సన్నిహితంగా గడుపుతారు, వారినే ఎక్కువ ఇష్టపడతారు. తాతయ్యలతో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఎంతటి వారికైనా బాధ కలగకమానదు.
అమ్మమ్మ లేదా నాన్నమ్మలతో (Grand Parents) మనవళ్లకు (Grand Son) ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల కంటే అమ్మమ్మ, నాన్నమ్మలతోనే ఎక్కువ సన్నిహితంగా గడుపుతారు, వారినే ఎక్కువ ఇష్టపడతారు. తాతయ్యలతో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఎంతటి వారికైనా బాధ కలగకమానదు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుర్రాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Viral Video).
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ యువకుడు ఇంటి బయట అరుగు మీద కూర్చున్న అమ్మమ్మతో అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. తన చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో ఆమె వీపు మీద గట్టిగా కొట్టాడు. కొట్టిన తర్వాత ఆమెను మరింతగా హెచ్చరించి లోపలికి వెళ్లాడు. ఆ వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ అతడిని తిడుతోంది. రాయ్‌పూర్ (Raipur)లోని పురానీ బస్తీ పోలీసు పరిధిలోని అమర్ పూరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ ఘటనను ఎదురింటి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
@Ravimiri1 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆ కుటుంబ సభ్యులు భయపడ్డారు. ఇంటికి తాళం వేసుకుని అందరూ కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కాగా, వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహంగా కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: బాయ్‌ఫ్రెండ్‌తో ఛాటింగ్.. పేరెంట్స్‌కు ఎలా దొరికిపోయిందో చూస్తే నవ్వాపుకోలేరు..
Viral Video: ఈ రైల్వే గార్డుకు సలాం కొట్టాల్సిందే.. తల్లిదండ్రులను పిల్లలతో ఎలా కలిపాడో చూడండి..
Viral Video: ఈ బైక్ ఎలా నడుస్తోందబ్బా.. పెట్రోల్ లేదు, పెడల్ లేదు.. గాలిలో దూసుకుపోతున్న బైక్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Nov 09 , 2024 | 07:24 AM