Viral: వధువు మెడలో తాళి కడుతుండగా వచ్చిందో మెసేజ్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!
ABN, Publish Date - Jul 14 , 2024 | 03:09 PM
అందరూ పెళ్లి మండపంలో సరదాగా నవ్వుతూ గడుపుతున్నారు. వధూవరులు పురోహితుడి ముందు పీటలపై కూర్చున్నారు. మరికొద్ది సేపట్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఆ సమయంలో వరుడి మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన వరుడి మొహంలో రంగులు మారాయి.
అందరూ పెళ్లి (Marriage) మండపంలో సరదాగా నవ్వుతూ గడుపుతున్నారు. వధూవరులు పురోహితుడి ముందు పీటలపై కూర్చున్నారు. మరికొద్ది సేపట్లో వధువు మెడలో వరుడు (Groom) తాళి కట్టాల్సి ఉంది. ఆ సమయంలో వరుడి మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన వరుడి మొహంలో రంగులు మారాయి. ఆ అమ్మాయిని (Bride) పెళ్లి చేసుకోనని వరుడు తేల్చి చెప్పాడు.. పెళ్లి రద్దు చేసుకుని బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అమ్రోహాలో చోటుచేసుకుంది (Viral News).
అమ్రోహాకు చెందిన ఓ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాల సభ్యులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. మరికాసేపట్లో పెళ్లి తంతు పూర్తవుతుంది అనగా వరుడి మొబైల్‌కు కొన్ని ఫొటోలు వచ్చాయి. ఆ ఫొటోలు చూసి వరుడు షాకయ్యాడు. ఎందుకంటే వధువు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు అవి. ఆ వధువు ప్రియుడే ఆ ఫొటోలను వరుడి మొబైల్‌కు పంపాడు. తమ ప్రైవేట్ ఫొటోలను, వీడియోలను వరుడికి పంపాడు. అవి చూసిన వరుడు పెళ్లిని మధ్యలోనే ఆపేసుకుని వెళ్లిపోయాడు.
అసలేం జరిగిందో అర్థం కాక వధువు కుటుంబ సభ్యులు బిత్తరపోయారు. వధువు మాజీ ప్రియుడే ఇదంతా చేశాడని తెలుసుకుని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 14 , 2024 | 03:09 PM