Viral Video: తమ్ముడూ.. ఇలా అయితే వధువు పారిపోతుందేమో.. పెళ్లిలో వరుడి తుఫాన్ డ్యాన్స్ చూడండి..!
ABN, Publish Date - Aug 03 , 2024 | 03:39 PM
ప్రస్తుతం పెళ్లిళ్లలో డ్యాన్సింగ్ ట్రెండ్ అనేది బాగా పాపులర్. పెళ్లికి హాజరయ్యే బంధువులు, స్నేహితులే కాదు.. వధూవరులు కూడా వేదిక మీద డ్యాన్స్‌లు వేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అలాంటి డ్యాన్సింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం పెళ్లిళ్లలో (Wedding) డ్యాన్సింగ్ ట్రెండ్ అనేది బాగా పాపులర్. పెళ్లికి హాజరయ్యే బంధువులు, స్నేహితులే కాదు.. వధూవరులు కూడా వేదిక మీద డ్యాన్స్‌లు (Dance) వేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అలాంటి డ్యాన్సింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో వరుడి డ్యాన్స్ (Groom Dance) చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. p_r_i_n_c_e_09242 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న వీడియోలో, వధువు డ్యాన్స్ ఫ్లోర్ మీద నిలబడి ఉంది. బంధు మిత్రులు వరుడిని బలవంతంగా డ్యాన్స్ ఫ్లోర్ మీదకు పంపించారు. డ్యాన్స్ ఫ్లోర్ మీదకు వచ్చిన వరుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ``కహో నా ప్యార్ హై`` చిత్రంలోని ``ఆయ్ ప్యార్ కీ యే రూట్`` పాటకు వరుడు తనదైన శైలిలో డ్యాన్స్ చేశాడు. ఆ పాటకు వరుడు విపరీతమైన స్పీడ్‌తో డ్యాన్స్ చేయడం చూసి అక్కడ నిల్చున్న జనాలు ఆశ్చర్యపోయారు. చుట్టూ ఉన్న వారు చప్పట్లతో అతడిని ప్రోత్సహించారు. వరుడి డ్యాన్సింగ్ స్పీడ్ చూసి వధువు కూడా ఆశ్చర్యపోయారు.
ఆ వైరల్ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. దాదాపు 55 వేల మంది ఈ పాటను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్లు చేశారు. ``బ్రదర్.. పెళ్లి కూతురు భయపడుతుందేమో``, `` బ్రదర్, వేగాన్ని తగ్గించండి లేకపోతే వధువు పారిపోతుంది``, ``పెళ్లి అవుతోందనే ఆనందం అలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఐదు సింహాలు చుట్టుముడితే ఎలా ఉంటుంది.. ఓ హిప్పో ఏం చేసిందో చూడండి..!
Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 03 , 2024 | 03:39 PM