Viral Video: ఎంత పెళ్లైతే మాత్రం మరీ ఇంత ఆనందమా? నడిరోడ్డు మీద వరుడి వింత డ్యాన్స్ చూడండి..
ABN, Publish Date - Jun 08 , 2024 | 03:03 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పెళ్లిళ్లకు సంబంధించిన రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పెళ్లిళ్లకు సంబంధించిన రకరకాల వీడియోలు (Wedding Videos) మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని వరుడి (Groom) ఆనందం చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే. పెళ్లవుతోందనే ఆనందంలో ఆ వరుడు ఒళ్లు మర్చిపోయి మరీ చిందులేశాడు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది (Viral Video).
sambalpuria_ame అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. డీజేకు తగినట్టుగా వరుడు డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే సంతోషంలో ఉన్నట్టుండి నాగినీ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు (Groom strange dance). రోడ్డు మీద కూర్చుని, పడుక్కుని వింత వింతగా డ్యాన్స్ చేశాడు. తను వేసుకున్న పెళ్లి బట్టలు పాడైపోతాయని కూడా అతడు పట్టించుకోలేదు. తడి తడిగా ఉన్న రోడ్డు మీదే దొర్లేశాడు. ఆ వరుడి డ్యాన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు దాదాపు కోటి వ్యూస్ వచ్చాయి. దాదాపు 5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను వెల్లడించారు. ``పెళ్లవుతోందనే ఆనందం``, ``ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు ఉన్నాడు``, ``ఇదే చివరి సంతోషం``, ``ఈ డ్యాన్స్ చూస్తే వధువు పారిపోతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఎవర్రా మీరంతా.. వర్షం నీటిని కూడా వదలరా?.. నడిరోడ్డు మీద ఈ పనులేంటి?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 08 , 2024 | 03:03 PM