Viral video: వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.. వరుడిని పరుగులు పెట్టించిన కుర్రాడు.. అసలేం జరిగిందంటే..
ABN, Publish Date - Nov 30 , 2024 | 03:52 PM
హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఒక ఉత్సవం. వరుడు బంధుమిత్రులతో ఊరేగింపుగా కల్యాణ మండపానికి వస్తాడు. వధువు తరఫు బంధువులు అతడికి ఘనంగా స్వాగతం పలుకుతారు. అలాంటి ఊరేగింపు సమయంలో వరుడిని పరుగులు పెట్టించాడు ఓ కుర్రాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మన దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల (Wedding) సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. దేశవ్యాప్తంగా కొన్ని వందల, వేల వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఒక ఉత్సవం. వరుడు (Groom) బంధుమిత్రులతో ఊరేగింపుగా కల్యాణ మండపానికి వస్తాడు. వధువు తరఫు బంధువులు అతడికి ఘనంగా స్వాగతం పలుకుతారు. అలాంటి ఊరేగింపు సమయంలో వరుడిని పరుగులు పెట్టించాడు ఓ కుర్రాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోను చూస్తే నవ్వాపుకోవడం కష్టం. ఆ వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది (Viral Video).
safalbanoge అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుక జరుగుతోంది. వరుడు తన సన్నిహితులతో కలిసి కల్యాణ మండపానికి ఊరేగింపుతో వస్తున్నాడు. మహారాజు తరహాలో సిద్ధమైన వరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ ఉంది (Garland of notes). ఠీవీగా నడుస్తున్న ఆ వరుడి దగ్గరకు ఓ కుర్రాడు వచ్చాడు. కొద్దిసేపు వరుడితో పాటు కలిసి నడిచాడు. అదును చూసి వరుడి మెడలోని కరెన్సీ నోట్ల దండను లాగేసి పారిపోయాడు. షాకైన వరుడు ఆ కుర్రాడిని పట్టుకునేందుకు పరుగులు పెట్టాడు. ఆ ఘటన మొత్తం పెళ్లి వీడియోలో రికార్డ్ అయింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వెరీ ఫన్నీ``, ``పాపం.. వరుడికి అనుకోని ఘటన``, ``అందుకే డబ్బులను అంత బహిరంగంగా ప్రదర్శించకూడదు``, ``పెళ్లి ఊరేగింపు అంతా ఆ కుర్రాడి కోసం పరుగులు పెట్టి ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీ కళ్ల వపర్‌కు టెస్ట్.. గులాబీల మధ్యనున్న పీతను 10 సెకెన్లలో గుర్తించండి..
Viral Video: వామ్మో.. ఇదెక్కడి వింత జంతువు.. ఈ వీడియో చూస్తే భయంతో షాకవ్వాల్సిందే..
Viral Video: వామ్మో.. ఇలా అయితే ఎలా.. వేదిక మీదే కొట్టుకున్న వధూవరులు.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 30 , 2024 | 03:52 PM