ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పెళ్లి మండపం నుంచి పారిపోతున్నాడా? రోడ్లపై ఆ వరుడు ఎందుకలా తిరుగుతున్నాడంటే..

ABN, Publish Date - Oct 13 , 2024 | 04:46 PM

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి పెళ్లి కొడుకు గెటప్ వేసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు. రోడ్డు మీద ఉన్న జనాలు అతడిని విచిత్రంగా చూస్తున్నారు. కొందరు అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి ఆ గెటప్‌లోనే ఊరంతా తిరిగి చివరకు అసలు విషయం చెప్పాడు.

Groom was seen walking on the road

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యపరిచేవిగా ఉంటే, మరికొన్ని ఫన్నీగా ఉంటున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి పెళ్లి కొడుకు (Groom) గెటప్ వేసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు. రోడ్డు మీద ఉన్న జనాలు అతడిని విచిత్రంగా చూస్తున్నారు. కొందరు అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి ఆ గెటప్‌లోనే ఊరంతా తిరిగి చివరకు అసలు విషయం చెప్పాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (Viral Video).


explore_with_jatin అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. షేర్వాణి, తలపాగా ధరించిన ఓ యువకుడు నడిరోడ్డుపై ఒంటరిగా వెళుతూ అందరికీ షాకిచ్చాడు. పెళ్లి కొడుకు గెటప్‌లో చాలా సీరియస్‌గా, హుందాగా, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడిని చూసిన వారు ఆశ్చర్యపోయారు. చాలా మంది అతడిని వీడియోలు తీశారు. కొంతమంది అతడిని చూసి నవ్వుకున్నారు. వీడియో చివర్లో ఆ వ్యక్తి అసలు విషయం చెప్పాడు. సోషల్ మీడియా ఫాలోవర్లు ఇచ్చిన ఓ ఛాలెంజ్‌ను పూర్తి చేసే క్రమంలోనే అలా చేసినట్టు క్లారిటీ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని స్వీకరించి పూర్తి చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. 14 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వరుడు రాయల్‌గా కనిపిస్తున్నాడు, అయితే రోడ్డుపై అలా తిరుగుతున్నాడు ఏంటి``, ``ఇదెక్కడి పిచ్చి ఛాలెంజ్``, ``వరుడు పెళ్లి మండపం నుంచి పారిపోతున్నాడు``, ``బ్రదర్.. వధువు నచ్చలేదా``, ``చేసుకోబోయే అమ్మాయి నచ్చకపోతే నేను కూడా అలాగే నడిచి వెళ్లిపోతా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: తెలివి చూస్తే ఔరా అనాల్సిందే కానీ, బట్టలు కుట్టడం కోసం అంత ఖర్చు అవసరమా..?


Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. రాణి గీసిన చిత్రంలోని కప్ప ఏదో సరిపోల్చండి..


Viral Video: బాబూ.. అది కొండచిలువ అనుకున్నావా? బల్లి అనుకున్నావా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూస్తే షాక్..


Viral Video: సింహం అక్కడ ఉండాల్సింది కాదు.. సింహంతో ఓ వ్యక్తి ఎలా ఆడుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 13 , 2024 | 04:46 PM