ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Oldest Man: చేపలు, చిప్స్, లక్ .. ఇవే నా సీక్రెట్..111 ఏళ్ల గిన్నిస్ రికార్డు విజేత ప్రకటన

ABN, Publish Date - Apr 07 , 2024 | 05:37 PM

ఇంగ్లండ్‌కు చెందిన 111 ఏళ్ల జాన్.. ప్రపంచంలో అత్యధిక వయసున్న పురుషుడిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. చేపలు, చిప్స్, కాస్తంత అదృష్టమే తన శతాధిక ఆయర్దాయానికి కారణమని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అత్యధిక వయసున్న పురుషుడిగా (World's oldest living Man) బ్రిటన్‌కు చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్‌వుడ్ గిన్నిస్ రికార్డు (Guinness Records) సొంతం చేసుకున్నారు. ఆయన కంటే ఎక్కువ వయసున్న మరో ఇద్దరు వృద్ధులు ఇటీవలే మరణించడంతో జాన్‌కు ఈ గుర్తింపు దక్కింది. జాన్ వయసు ప్రస్తుతం 111 ఏళ్లు. వెనుజులాకు చెందిన 114 ఏళ్ల యువాన్ విన్సెంటే హువారెజ్‌కు గతంలో అత్యధిక వయసున్న పురుషుడిగా పేరుండేది. ఈ నెలలోనే ఆయన మరణించారు. 112 ఏళ్ల వయసు గల జపాన్ వ్యక్తి జిసాబురో సొనోబే మార్చిలోనే కన్నుమూశారు. దీంతో, జాన్‌ను గిన్నిస్ రికార్డు వరించింది. గురువారం సౌత్‌పోర్టులోని ఆయన ఇంటికి వచ్చి అధికారులు గిన్నిస్ రికార్డు ప్రదానం చేశారు.

Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో


ఈ సందర్భంగా మీడియాతో జాన్ ముచ్చటించారు. ఇంతటి సుదీర్ఘ జీవితంలో తను నేర్చుకున్న ఎన్నో విషయాలు పంచుకున్నారు. తాను గతంలో బ్రిటన్ ఆర్మీలో పనిచేశానని ఆయన చెప్పుకొచ్చారు. 1912 ఆగస్టు 26న జన్మించిన జన్ రెండు ప్రపంచయుద్ధాలను చూశారు. అకౌంటెంట్‌గా రిటైర్ అయిన ఆయన జీవితంలో ఏదైనా ఓ పరిమితికి లోబడి ఎంజాయ్ చేయడమే తన ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి కారణమని చెప్పుకొచ్చారు. ‘‘అతిగా తిన్నా, అతిగా తాగినా, అతిగా ఎక్సర్‌సైజులు చేసినా చివరకు వాటి దుష్ఫరిణామాలు అనుభవించాల్సిందే’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Viral: ఇది ఎర్ర బస్సా..ఎయిర్ ఇండియా విమానమా.. నెట్టింట వైరల్‌గా మారిన ఉదంతం


తనకు ధూమపానం అలవాటు లేదని, అరుదుగా మాత్రమే మద్యం సేవిస్తానని జాన్ చెప్పుకొచ్చారు. వారానికొకసారి చేపలు, చిప్స్ తింటానని అన్నారు. వీటితో పాటు కాస్తంత అదృష్టం కూడా కలిసొచ్చిందన్నారు. ‘‘ఒక్కముక్కలో చెప్పాలంటే ఇదంతా అదృష్టమే. ఎప్పుడు పుట్టేది, ఎప్పడు పోయేది మనచేతుల్లో ఉండదు. ఈ విషయంలో మనం చేయగలిగిందేమీ లేదు’’ అని ముక్తాయించారు. కాగా, ప్రపంచంలో అత్యధిక వయసుగల మహిళగా స్పెయిన్‌కు చెందిన మారియా మొరేరా గిన్సిన్ రికార్డు సొంతం చేసుకుంది. ఆమె వయసు 117 ఏళ్లు.

Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 05:43 PM

Advertising
Advertising