Viral: వామ్మో.. లీటరు గాడిద పాలు రూ.7 వేలు! కోట్లల్లో ఆర్జిస్తున్న వ్యాపారి!
ABN, Publish Date - Apr 22 , 2024 | 06:04 PM
గాడిద పాలు అమ్ముకుంటూ కోట్లల్లో ఆర్జిస్తున్న గుజరాత్ వ్యాపారి ధీరేన్ సోలంకీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: గాడిద పాలు (Donkey Milk) అమ్ముకుంటూ కోట్లల్లో ఆర్జిస్తున్న గుజరాత్ (Gujarat) వ్యాపారి ధీరేన్ సోలంకీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు (Viral). రూ.22 లక్షల పెట్టుబడి, 20 గాడిదెలతో అతడు ప్రారంభించిన వ్యాపారం ప్రస్తుతం కనకవర్షం కురిపిస్తోంది. లీటరు ఆవు పాల ధర గరిష్ఠంగా రూ.65 ఉంటే లీటరు గాడిద పాల ధర గరిష్ఠంగా రూ.7 వేల వరకూ ఉంటోంది. దీంతో, ధీరేన్ విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది.
వాస్తవానికి ధీరేన్‌కు ఈ విజయం అంత సులువుగా దక్కలేదు. మొదట్లో అతడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సొంత రాష్ట్రంలో గాడిద పాలకు డిమాండ్ లేక అవస్థలు పడాల్సి వచ్చింది. అయితే, దక్షిణాదిన గాడిద పాలకు డిమాండ్ ఉందని గుర్తించిన అతడు ఇటువైపు దృష్టిసారించడంతో అతడి దశ తిరిగింది (Gujarat Man Builds Successful Business By Selling Donkey Milk For Rs 7000 A Litre).
Viral: ఇంత నీచానికి ఎందుకు దిగజారుతారో? ఈమె 10వ తరగతి స్టేట్ ర్యాంకర్ అని తెలిసినా..
ప్రస్తుతం ధీరేన్ కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు గాడిద పాలు సరఫరా చేస్తున్నాడు. ఆయన కస్టమర్లలో కాస్మెటిక్ కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేకపోయినా అతడు మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆన్‌లైన్‌లో కూడా గాడిద పాల విక్రయాలు ప్రారంభించడం అతడికి బాగా లాభించింది. అంతేకాదు, కిలో గాడిద పాల పౌడర్ రూ. 1లక్షకు అమ్ముతున్నాడు.
ఆన్‌లైన్ విక్రయాల ద్వారా గాడిద పాలకు డిమాండ్ కూడా పెరిగిందని ధీరేన్ సోలంకీ చెప్పాడు. తను ప్రస్తుతం అర కోటి నుంచి రెండున్న కోట్ల టర్నోవర్ సాధిస్తున్నట్టు తెలిపాడు. ‘‘అప్పట్లో నేను ప్రైవేటు జాబ్ చేసేవాడిని. అక్కడ వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు. ఈ క్రమంలో దక్షిణాదిన గాడిద పెంపకం గురించి తెలుసుకున్నా. ఆ తరువాత కొందిరిని కలిసి మరిన్ని విషయాలు తెలుసుకుని ఈ వ్యాపారంలోకి దిగా’’ అని ధీరేన్ చెప్పుకొచ్చాడు.
నేషనల్ లైబ్రెరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, గాడిద పాలతో చర్మంపై ముడతలు తగ్గిపోతాయని కొందరి నమ్మకం. రోమన్ చక్రవర్తి నీరో భార్య వల్ల గాడిద పాల ఉపయోగాలు ప్రపంచానికి తెలిసాయట. అప్పట్లో ఆమె గాడిద పాలు కలిపిన నీళ్లతో స్నానం చేసేదట.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 22 , 2024 | 06:10 PM