ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hair Growth: కొబ్బరి నూనెలో ఈ పదార్థాలు మిక్స్ చేసి రాస్తే చాలు.. జుట్టు చెప్పలేనంత పొడవుగా, బలంగా మారుతుంది..!

ABN, Publish Date - Aug 12 , 2024 | 02:52 PM

పొడవాటి అందమైన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. నేటికాలం జీవనశైలి కారణంగా చాలామందికి జుట్టు విరిగిపోవడం, పెళుసుగా మారడం, పలుచగా మారిపోవడం జరుగుతుంది. ఇక మరికొందరికి జుట్టు బూడిదరంగులోకి మారడం, రాగి రంగులోకి మారడం, జుట్టు టెంకాయ పీచులా రఫ్ గా ఉండటం కూడా చూస్తుంటాం.

Hair Growth

పొడవాటి అందమైన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. నేటికాలం జీవనశైలి కారణంగా చాలామందికి జుట్టు విరిగిపోవడం, పెళుసుగా మారడం, పలుచగా మారిపోవడం జరుగుతుంది. ఇక మరికొందరికి జుట్టు బూడిదరంగులోకి మారడం, రాగి రంగులోకి మారడం, జుట్టు టెంకాయ పీచులా రఫ్ గా ఉండటం కూడా చూస్తుంటాం. ఈ సమస్యల పరిష్కారం కోసం.. జుట్టు పొడవుగా, బలంగా పెరగడానికి చాలామంది మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ వాడుతుంటారు. వాటికోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ కొబ్బరి నూనెలో కేవలం మూడు పదార్థాలు మిక్స్ చేసి రాస్తుంటే జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతుందట. అవేంటంటే..

Breakfast: బ్రేక్పాస్ట్ లో ఇష్టంగా తినే ఈ 3 ఆహారాలు స్లో పాయిజన్ లా పనిచేస్తాయట..!



కొబ్బరి నూనె, వేప..

జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే కొబ్బరి నూనెలో వేప ఆకులను మిక్స్ చేసి వేడి చేసి నిల్వచేసుకోవాలి. లేదంటే ఈ నూనెను అప్పటికప్పుడు కొద్దిగా తయారు చేసుకోవచ్చు. ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేయాలి. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జుట్టును బలోపేతం చేస్తుంది. అయితే నూనె అప్లై చేసిన 2 గంటలు అలాగే ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయాలి.

కొబ్బరినూనె, దాల్చిన చెక్క..

దాల్చిన చెక్క కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. ఒక గాజు సీసా తీసుకుని అందులో కొబ్బరినూనె వేయాలి. ఇదే గాజు సీసాలో దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని రోజూ కనీసం ఒక రెండు మూడు గంటలు ఎండలో ఉంచాలి. వారం రోజుల తరువాత దీన్ని ఇంట్లో భద్రపరచుకోవాలి. ఈ నూనెను వారానికి ఒకసారి అప్లై చేయవచ్చు. నూనె అప్లై చేసిన తరువాత కనీసం ఒక గంటసేపు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. జుట్టు బలంగా మారుతుంది.

ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది..!



కొబ్బరినూనె, విటమిన్-ఇ ఆయిల్..

జుట్టు సంరక్షణలోనూ, చర్మ సంరక్షణలోనూ విటమిన్-ఇ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్-ఇ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. గంట సేపు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇది జుట్టు చివర్లు చిట్లడాన్ని సులభంగా నివారిస్తుంది.

పై చిట్కాలు మాత్రమే కాకుండా కొబ్బరినూనెలో ఉసిరి, మందారం, మెంతులు వంటివి కూడా కలిపి జుట్టుకు అప్లై చేయవచ్చు. అయితే స్వచ్చమైన కొబ్బరి నూనె మంచి ఫలితాలు ఇస్తుంది.

గులాబీ రేకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

ఆడవారిలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 12 , 2024 | 02:57 PM

Advertising
Advertising
<