ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hair Growth: ఈ 3 రకాల నూనెలను మిక్స్ చేసి జుట్టుకు వాడండి.. జుట్టు పెరుగుదల చూసి మీరే షాకవుతారు..!

ABN, Publish Date - Aug 08 , 2024 | 04:17 PM

ఇంట్లోనే మూడు రకాల నూనెలను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేస్తూ ఉంటే జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. చిన్న వయసులోనే జుట్టు బూడిదరంగులోకి మారడం, జుట్టు పలుచగా ఉండటం వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.

Hair growth oil

ఈ రోజుల్లో జుట్టు రాలడం, బలహీనపడటం అనే సమస్య ఎక్కువగా ఉంటోంది. జుట్టు దృఢంగా ఉండాలంటే సరైన పోషకాహారం, జుట్టు సంరక్షణ చర్యాలు అవసరం అంటున్నారు నిపుణులు. జుట్టు సంరక్షణలో జుట్టుకు నూనె పెట్టడం కూడా ఒకటి. నేటికాలంలో జుట్టుకు నూనె పెట్టుకుని బయటకు వెళ్లేవారు తక్కువయ్యారు. ఈ కారణంగా కూడా జుట్టు బలహీనపడుతుంది. అయితే ఇంట్లోనే మూడు రకాల నూనెలను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేస్తూ ఉంటే జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. చిన్న వయసులోనే జుట్టు బూడిదరంగులోకి మారడం, జుట్టు పలుచగా ఉండటం వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఏయే నూనెలను మిక్స్ చేయాలో తెలుసుకుంటే..

Collagen Foods: ఈ 5 ఆహారాలు తప్పనిసరిగా తినండి.. కొల్లాజెన్ పెరిగి యవ్వనంగా కనిపిస్తారు..!



హెయిర్ ఆయిల్..

  • కొబ్బరి నూనె..

  • గ్రేప్ సీడ్ ఆయిల్..

  • రోజ్మేరీ ఆయిల్..

మూడు నూనెలను ఒక్క స్పూన్ చెప్పున తీసుకోవాలి. వీటిని ఒక కప్పులో మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి. జుట్టు పరిమాణాన్ని బట్టి నూనె ఎక్కువ తీసుకోవచ్చు. ఈ నూనెను తలకు పట్టించిన తరువాత అరగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత వేడి నీటిలో ముంచిన టవల్ ను పిండేసి తలకు చుట్టుకోవాలి. దీని వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇలా చేసిన రెండు గంటల తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

Paneer: మీకు పనీర్ అంటే బాగా ఇష్టమా? ఈ 6 సమస్యలున్నవారు పొరపాటున కూడా తినకూడదట..!



  • కొబ్బరినూనెలలో విటమిన్-ఇ ఉంటుంది. ఇది జుట్టుకు పోషణ ఇస్తుంది.

  • గ్రేప్ సీడ్ ఆయిల్ లో విటమిన్-ఇ తో పాటు లినోలిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి సూర్యరశ్మి, అధిక వేడి నుండి జుట్టును కాపాడుతుంది.

  • రోజ్మేరీ జుట్టు పెరుగుదలలో మ్యాజిక్ చేస్తుంది. తల చర్మంలో రక్త ప్రసరణను మెరుగ్గా ఉంచుతుంది. జుట్టును బలపరుస్తుంది. ఈ నూనెను వారానికి రెండు సార్లు జుట్టుకు అప్లై చేస్తుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

Water poisoning: నీరు కూడా విషంలా పనిచేస్తుందా? ఎవరికి ఇలా జరిగే అవకాశం ఉంటుందంటే..!


Vakkaya: వాక్కాయ దొరికితే అస్సలు వదలకండి.. వీటిని తింటే ఎన్ని లాభాలు ఉంటాయంటే..!


నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 08 , 2024 | 04:17 PM

Advertising
Advertising
<