ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hair Oil: ఈ ఒక్క నూనెకు ఇంత పవరా..? ఇంట్లోనే తయారుచేసే ఈ నూనెను జుట్టుకు రాస్తే మ్యాజిక్కే..!

ABN, Publish Date - Jul 20 , 2024 | 01:30 PM

. అమ్మాయిలు ఎప్పుడూ పొడవుగా, ఒత్తుగా, నల్లగా ఉన్న జుట్టు కావాలని కోరుకుంటారు. దాని పర్యావసానమే మార్కెట్లో షాంపూలు, నూనెలు, సీరమ్ లు, హెయిర్ మాస్క్ లు. అయితే ఇవన్నీ రసాయనాలతో కూడినవి. వీటిని వాడటం వల్ల జుట్టు మూలాలు మరింత బలహీనం అవుతాయి.

Hair Oil

పొడవాటి జుట్టు వద్దని ఏ అమ్మాయి చెప్పదు. అమ్మాయిలు ఎప్పుడూ పొడవుగా, ఒత్తుగా, నల్లగా ఉన్న జుట్టు కావాలని కోరుకుంటారు. దాని పర్యావసానమే మార్కెట్లో షాంపూలు, నూనెలు, సీరమ్ లు, హెయిర్ మాస్క్ లు. అయితే ఇవన్నీ రసాయనాలతో కూడినవి. వీటిని వాడటం వల్ల జుట్టు మూలాలు మరింత బలహీనం అవుతాయి తప్ప జుట్టు ఆరోగ్యంగా పెరగదు. వీటికి బదులు ఇంట్లోనే ఆరోగ్యమైన పద్దతిలో నూనెను తయారుచేసుకుని వాడితే జుట్టు పెరుగుదలలో షాకింగ్ ఫలితాలు పక్కాగా చూస్తారు. అదేంటో దాన్ని ఎలా తయారు చేసుకుని వాడాలో తెలుసుకుంటే..

Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే.. వెంటనే వైద్యుడిని కలవాల్సిందే..!



హెయిర్ ఆయిల్..

ఆయుర్వేదం జుట్టు పెరుగుదలకు రికమెండ్ చేసే నూనెలలో నువ్వుల నూనె మొదటి స్థానంలో ఉంటుంది. నువ్వుల నూనెను ఆయుర్వేదంలో పలురకాల సమస్యలకు వైద్యం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్లు, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్-బి, ఇ, కె కూడా ఉంటాయి. నువ్వుల నూనెను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది. జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నువ్వుల నూనెను జుట్టుకు ఎలా సిద్దం చేయాలంటే..

కావలసిన పదార్థాలు..

నువ్వుల నూనె.. 1 కప్పు

మెంతులు .. 1 కప్పు..

Hemoglobin: ఈ 8 ఆహారాలు తీసుకుంటే చాలు.. మహిళలలో హిమోగ్లోబిన్ కు ఢోకా ఉండదు..!



నువ్వుల నూనె, మెంతులు రెండూ ఒకటే పరిమాణంలో తీసుకుని రెండింటిని ఒక ఇనుప బాండీలో వేసి స్టౌ మీద వేడి చేయాలి. దీన్ని చిన్న మంట మీద మాత్రమే ఉడికించాలి. సుమారు 5 నుండి 10 నిమిషాలు నువ్వుల నూనె మెంతులు రెండూ ఉడికిన తరువాత స్టౌ ఆఫ్ చేయాలి. నూనె చల్లగా అయిన తరువాత వడగట్టి దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను వారంలో కనీసం రెండు నుండి మూడు సార్లు జుట్టుకు రాసుకుని, కుదుళ్లకు పట్టేలా బాగా మసాజ్ చేసుకోవాలి. ఒక గంట తరువాత తలస్నానం చెయ్యాలి.

మెంతి గింజలలో కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే గుణాలు ఉంటాయి. జుట్టు మందంగా పెరగడంలో ఇవి సహాయపడతాయి. జుట్టుకు మేలు చేసే అమైనో యాసిడ్స్ మెంతి గింజలలో ఉంటాయి. ఇవి హెయిర్ ఫాల్ అరికట్టి, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

ఈ 5 డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే అస్సలు తినకూడదు..!

ఈ పానీయాలు తాగితే చాలు.. చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 20 , 2024 | 01:30 PM

Advertising
Advertising
<