Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా.. ఫోన్లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ABN, Publish Date - May 11 , 2024 | 07:50 AM
ఆధార్ కార్డు పోతే తిరిగి పొందడానికి నెట్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకుంటారు. ఫోన్లోనే ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు. ఫోన్లో ఈ ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: అసలే ఎన్నికల కాలం.. ఈ టైంలో ఓటర్ ఐడీతోపాటు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్(Aadhaar Card) తప్పనిసరి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సందర్భంలో కొందరు ఆధార్ కార్డుని కోల్పోతారు. తిరిగి పొందడానికి నెట్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకుంటారు. ఫోన్లోనే ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు. ఫోన్లో ఈ ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
ఈ-ఆధార్ డౌన్‌లోడ్ ఇలా...
ఈ-ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ డిజిటల్ కాపీ ఫిజికల్ ఆధార్ కార్డులా అన్ని సేవలకు చెల్లుబాటు అవుతుంది. UIDAIతో మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకుని ఉంటే, దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
UIDAI వెబ్‌సైట్ విజిట్ చేయాలి.
ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ID ఎంటర్ చేయాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీంతో గుర్తింపును నిర్ధారించుకోవాలి. తర్వాత ఈ-ఆధార్‌ను PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్ PVC కార్డు...
ఆధార్ పీవీసీ అనేది, పాలీ వినైల్ క్లోరైడ్ (PVC)తో తయారు చేసే కార్డు. ఇది క్రెడిట్ కార్డు లాగానే కనిపిస్తుంది. దానిపై ఆధార్ వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఇంటికే డెలివరీ రూపంలో అందుకోవాలంటే రూ.50 ఖర్చవుతుంది. ఇంటికి రావడానికి వారం రోజులు పడుతుంది. దీన్ని ఎలా పొందాలంటే..
UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి లేదా ఎంఆధార్ (mAadhaar) యాప్ డౌన్‌లోడ్ చేయాలి.
ఈ ఫిజికల్ కార్డు పొందాలంటే ఆధార్ నంబర్, ఎన్‌రోల్‌మెంట్ ID లేదా వర్చువల్ IDని సిద్ధంగా ఉంచుకోవాలి.
నిర్ధారించడం కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆర్డర్ చేయడానికి ఆన్ స్క్రీన్ సూచనలను ఫాలో అవ్వాలి. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ఫీజు చెల్లించాలి.
For Latest News and National News click here
Updated Date - May 11 , 2024 | 07:50 AM