ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఆడ తోడు దూరమై.. ఎంతటి నరకం అనుభవిస్తోందో! వీడియో చూసి నెటిజన్ల కన్నీళ్లు!

ABN, Publish Date - Feb 24 , 2024 | 05:33 PM

ఆడ తోడు కోల్పోయిన ఓ మగ కువాలా దాని మృతదేహం మీద పడి రోదిస్తున్న తీరు నెటిజన్లను అమితంగా కదిలిస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నా కొన్ని మాత్రం నెటిజన్ల మనసులపై అమిత ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా.. ఎక్కడో మారుమూల జరిగిన ఉదంతం గురించి క్షణాల్లో ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. ప్రస్తుతం అలాంటి ఓ షాకింగ్ వీడియోను చూసి జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ దృశ్యం చూస్తూన్న మనకే ఇంత బాధగా ఉంటే ఆ జంతువు ఎంతటి నరకం అనుభవిస్తోందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచమంతా వైరల్‌గా(ViralVideo) మారింది.

Viral: ఇది నిజంగా పిచ్చే, మనుషులు ఇలా ఎందుకుంటారో? 2 ఏళ్ల నాటి వీడియో చూసి ఐఎఫ్ఎస్ అధికారి గుస్సా


ఆస్ట్రేలియాలో (Australia) మాత్రమే కనిపించే కువాలల గురించి దాదాపు ప్రపంచమొత్తానికి తెలుసు. చూడటానికి ముద్దుగా ఉండే ఈ చిన్న జంతువుల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అయితే, తాజా వీడియో మాత్రం నెటిజన్ల గుండెలు పిండేస్తోంది. ఈ వీడియోలో.. తన ఆడ తోడును (Female companion) కోల్పోయిన ఓ మగ కువాలా (Male Koala Heartbroken) తీవ్ర ఆవేదన చెందుతుంది. ఏకంగా దాని మీద పడి ఏడ్చేస్తుంది. ఆడ కువాలా ఏ కారణంతో మరణించిందో తెలీదు కానీ ఈ దృశ్యం చూసిన జనాలు తట్టుకోలేకపోతున్నారు. చూస్తున్న మనకే కన్నీరు ఆగట్లేదు..ఇక దానికెంత నరకంగా ఉందో అంటూ కొందరు కామెంట్ చేశారు.

Viral: సంబరం పట్టలేకపోయిన ఏనుగు.. అది చేసిన పనికి అధికారులకే ఆశ్చర్యం.. ఈ వీడియో చూస్తే..


అయితే, జంతుశాస్త్రవేత్తలను కూడా ఈ వీడియో ఆశ్చర్యపరిచింది. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే కువాలాలు ఇంత భావోద్వేగం ప్రదర్శించడం అరుదేనని (Rare) చెబుతున్నారు. సాధారణంగా ఈ జంతువులు తామున్న పరిసరాల్లోకి ఇతర కువాలాలను అస్సలు రానివ్వవట. ఒక వేళ వచ్చినా కూడా వెంటనే తగువు పెట్టుకుని తరిమేస్తాయట. కేవలం బ్రీడింగ్ కాలంలోనే ఇది ఒకదాన్నొకటి సహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జంతువులే కదా అని తేలిగ్గా తీసుకోకూడదని వాటికీ భావోద్వేగాలు ఉంటాయని కొందరు వ్యాఖ్యానించారు. మనుషుల్లాగే అవి కూడా దగ్గరివారు పోతే కుమిలిపోతాయని అన్నారు.

Illegal Trading: ఇంటి నుంచే పని చేస్తున్న భార్య.. ఆమె తన కోలీగ్స్‌తో ఫోన్లో మాట్లాడుతుంటే సీక్రెట్‌గా విని..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 24 , 2024 | 06:24 PM

Advertising
Advertising