Viral Video: బెడ్రూమ్‌లో విషపూరిత సర్పాల రొమాన్స్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..
ABN, Publish Date - Oct 23 , 2024 | 03:03 PM
సాధారణంగా పాములంటే ఎక్కువ మంది భయపడతారు కాబట్టి, వాటికి సంబంధించిన వీడియోలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దాంతో పాములకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాములకు (Snakes) సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పాములంటే ఎక్కువ మంది భయపడతారు కాబట్టి, వాటికి సంబంధించిన వీడియోలకు (Snake Videos) ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దాంతో పాములకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో రెండు విషసర్పాలు (venomous snakes) ఓ ఇంటి బెడ్రూమ్‌లోకి దూరి రొమాన్స్ సాగిస్తున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
ఐఎఫ్‌ఎస్ అధికారి @ParveenKaswan ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో అత్యంత విషపూరితాలైన రెండు కట్ల పాములు (Walls Krait) కనిపిస్తున్నాయి. ఆ రెండూ ఓ గ్రామంలోని ఓ ఇంటి బెడ్రూమ్‌లోకి చొరబడి రొమాన్స్ చేసుకుంటున్నాయి. వాటిని చూసి ఇంటి వారు భయంతో ఇంటి బయటకు పరుగులు తీశారు. వెంటనే అటవీ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. అటవీ సిబ్బంది అక్కడకు చేరుకుని చాలా జాగ్రత్తగా ఆ పాములను పట్టుకున్నారు. వాటిని సమీప అడవిలోకి తీసుకెళ్లి సురక్షితంగా వదిలేశారు. ఆ పాములకు సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 2.2 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. దాదాపు 2.5 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``కాలుష్యానికి దూరంగా గ్రామాల్లో నివసించే వారు అలాంటి అతిథులకు పెద్దగా భయపడరు``, ``ఆ పాములు రొమాన్స్‌లో ఉన్నాయా? ఫైటింగ్ చేసుకుంటున్నాయా``, ``అటవీ సిబ్బంది ధైర్యానికి జోహార్లు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: బాబూ.. ఇదేం పని.. రైలు బాత్రూమ్ పక్కన ఉల్లిపాయల కటింగ్.. నెటిజన్లు షాక్..
Tibet: మన కళ్ల ముందే పరిణామ క్రమం.. టిబెట్ మహిళల శరీరతత్వంపై వెలువడిన ఆసక్తికర పరిశోధన..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Oct 23 , 2024 | 03:03 PM