ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Annapurna Hotel: టీ స్టాల్ నుంచి బ్రాండ్ రెస్టారెంట్ వరకు... అన్నపూర్ణ హోటల్ చరిత్ర ఇదే

ABN, Publish Date - Sep 14 , 2024 | 07:13 PM

తమిళనాడుకు చెందిన అన్నపూర్ణ హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రస్తుతం రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

చెన్నై: తమిళనాడుకు చెందిన అన్నపూర్ణ హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రస్తుతం రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోయంబత్తూర్‌కు ఐకాన్‌ నిలిచిన ఈ అన్నపూర్ణ హోటల్ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.1960లో కోయంబత్తూర్‌లోని ఆర్‌ఎస్ పురంలో అన్నపూర్ణ యజమాని దామోదరస్వామి నాయుడు మొదట టీ దుకాణం ప్రారంభించారు. తర్వాత ఆయన తన సోదరులు రంగసామి, రామసామి, లక్ష్మణ్‌లతో కలిసి కోయంబత్తూరులోని అప్పటి ప్రసిద్ధ కెన్నెడీ థియేటర్‌ సమీపంలో చిరుతిళ్ల దుకాణాన్ని స్టార్ట్ చేశారు.

తక్కువ ధరలకు రుచికరమైన ఆహారాన్ని అందించడంతో అన్నపూర్ణ అనధికాలంలోనే ఫేమస్ అయింది. 1960లో అన్నపూర్ణ హోటల్‌కు లభించిన ఆదరణ చూసి కెన్నెడీ థియేటర్ యజమాని తన థియేటర్‌లో క్యాంటీన్‌ పెట్టుకోవడానికి అనుమతించాడు. అలా అన్నపూర్ణ క్యాంటీన్‌ యజమాన్యం పాలకూర వడ, ఫిల్టర్ కాఫీని ఆ థియేటర్లో విక్రయించేవారు. అప్పట్లో థియేటర్లలో లభించే స్నాక్స్‌లో నాణ్యత తక్కువగా ఉండేది. అలాంటిది థియేటర్ లోపల వేడివేడి ఫిల్టర్ కాఫీ, వడ లభిస్తుంటే వదిలిపెడతారా. అలా అన్నపూర్ణ క్యాంటీన్ వ్యాపారం బాగా జరిగింది. రెండేళ్లలో సెంట్రల్ థియేటర్‌లో మరో క్యాంటీన్‌ను ప్రారంభించారు.


నాణ్యమైన భోజనం..

భోజనం నాణ్యంగా ఉండడంతో క్యాంటీన్‌ కిక్కిరిసిపోయేది. అన్నపూర్ణ ఫుడ్ తినడానికి జనాలు క్యూ కట్టేవారు. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే సరైన సమయమని భావించిన దామోదరస్వామి, ఆయన సోదరులు విస్తరణ ప్రణాళికలు రచించారు. తొలుత రాయల్ కాఫీ బార్ పేరుతో ఆర్ ఎస్ పురంలో తొలి బేకరీని ప్రారంభించారు. దీనికి కూడా భారీ స్పందన వచ్చింది. ఆ తర్వాత కోయంబత్తూరులోని దీవాన్ బహదూర్ రోడ్డులో అద్దెకు స్థలం తీసుకుని చేసి హోటల్‌ను ప్రారంభించారు. అన్నపూర్ణ పేరుతో తమ తొలి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అలా అన్నపూర్ణ హోటల్ మొదటి శాఖ 1968లో ప్రారంభమైంది.


కోయంబత్తూర్ ప్రైడ్..

కోయంబత్తూర్‌లో కెన్నీస్ భవన్, ఐడియల్ కాఫీ హౌస్ ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులవి. అన్నపూర్ణ హోటల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి వాటి పోటీని తట్టుకుని నిలబడింది. వారి హోటల్లో నాణ్యత, రుచి వినియోగదారులను ఆకర్షించాయి. దీనికితోడు కొత్త కొత్త ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకువస్తూ కోయంబత్తూరులో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం అన్నపూర్ణ హోటల్ కోయంబత్తూరుకు ఐకాన్‌గా నిలిచింది.

For Latest News and National News click here

Updated Date - Sep 14 , 2024 | 09:23 PM

Advertising
Advertising