Home Changing: ఇల్లు మారే ఆలోచనలో ఉన్నారా? ఈ 5 విషయాలను గుర్తుపెట్టుకోకపోతే చాలా నష్టపోతారు..!
ABN, Publish Date - May 10 , 2024 | 02:56 PM
సొంత ఇల్లు లేకపోతే ఒక్కచోట స్థిరంగా ఉండటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఏదో ఒక సమస్య కారణంగా ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారుతూనే ఉంటారు. అది ఇల్లు ఇరుకుగా మారిందని కావచ్చు, అద్దె ఎక్కువయ్యిందని కావచ్చు, లేదంటే ఇంటి యజమానుల నుండి అసౌకర్యం ఎదురవుతూ ఉండచ్చు. ఏది ఏమైనా ఇల్లు కట్టడం, కొనడమే కాదు.. సరైన ఇంటిని వెతికి అందులో చేరడం కూడా ఇప్పట్లో పెద్ద టాస్కే..
సొంత ఇల్లు లేకపోతే ఒక్కచోట స్థిరంగా ఉండటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఏదో ఒక సమస్య కారణంగా ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారుతూనే ఉంటారు. అది ఇల్లు ఇరుకుగా మారిందని కావచ్చు, అద్దె ఎక్కువయ్యిందని కావచ్చు, లేదంటే ఇంటి యజమానుల నుండి అసౌకర్యం ఎదురవుతూ ఉండచ్చు. ఏది ఏమైనా ఇల్లు కట్టడం, కొనడమే కాదు.. సరైన ఇంటిని వెతికి అందులో చేరడం కూడా ఇప్పట్లో పెద్ద టాస్కే.. కొత్త ఇంటికి మారాలనే తొందరలో కొందరు కొన్ని విషయాల గురించి ఆలోచించరు. మరికొందరికి ఆలోచన ఉన్నా.. వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అయితే చాలా చిన్నవి అనుకునే విషయాలు కూడా కొన్ని సందర్భాలలో ఇబ్బంది పెడతాయి. ఇల్లు మారే ముందు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటో తెలుసుకుంటే..
చెకింగ్..
కొన్ని ఇల్లు చూడానికి చాలా బాగుంటాయి. కానీ కొన్ని చోట్ల కుళాయిలు సరిగా పనిచేయకుండా ఉంటాయి. మరికొన్ని ఇళ్లలో వాష్ రూమ్ లలో సౌకర్యాలు సరిగా ఉండవు. ఫ్యాన్ సర్వీస్, ఏసీ పెట్టుకోవడానికి సౌలభ్యం వంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఇల్లంతా బాగుంది కదా ఇవి కాస్తా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఒకసారి అడ్జస్ట్ అవ్వాలని అనుకునే విషయాలు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులూ భరించాల్సిందే. కాబట్టి ఇలాంటి విషయాలలో కాంప్రమైజ్ కాకూడదు.
ఈ 9 ఆహారాలు ఎముకలను దారుణంగా దెబ్బతీస్తాయి..!
ఫర్నీచర్..
ఇల్లు బావుంది.. చూడటానికి నచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో చేరిపోదాం అని అనుకుంటారు కొందరు. కానీ అది చాలా తప్పు. చూసిన ఇల్లు ఫర్నీచర్ పెట్టుకోవడానికి తగినట్టు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంతే కాదు.. ఫర్నీచర్ ఏదైనా దెబ్బతిని ఉన్నా, దాన్ని మరమత్తు చేయించాల్సి వచ్చినా పాత ఇంటి నుండి కొత్త ఇంటికి తీసుకువచ్చే ముందే మరమ్మత్తు చేయించడం మంచిది. దీనివల్ల దాన్ని మోసుకెళ్లడం కూడా సులువు అవుతుంది. కొత్త ఇంట్లో మళ్లీ మరమ్మత్తు పనులు చేయించాల్సిన అవసరం ఉండదు.
శుభ్రత..
చాలామంది ఇల్లు మారేటప్పుడు సామాను అంతా ఇంట్లో చేర్చి, సర్ది, ఆ తరువాత ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెడతారు. కానీ ఇంటికి సామాను తరలించే ముందే ఒకసారి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే సామాను సర్థిన తర్వాత ఇంటిని రెండోసారి శుభ్రం చేసేటప్పుడు పెద్ద కష్టం అనిపించదు. అదే విధంగా ఇంట్లో సామాను కూడా మెల్లిగా ఒక్కొక్కటి సర్దడం మంచిది. ఒకే రోజు అన్నీ అయిపోవాలనే మెండితనంలో ఉండొద్దు.
గసగసాలు ఇలా వాడితే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం..!
ప్యాకింగ్..
చాలా మంది వస్తువులను ప్యాకింగ్ చేయడంలో విఫలమవుతారు. కొందరికి ప్యాక్ చేయడం సరిగా రాకపోతే మరికొందరికి ఎందులో ఏ వస్తువులు పెట్టామనేది సరిగా గుర్తుండదు. దీనివల్ల గందరగోళం నెలకొంటుంది. అలా కాకుండా వస్తువులను చక్కగా అట్టపెట్టెల్లో సర్ది.. ఆ తరువాత అట్టపెట్టెల పైన అందులో ఉన్న వస్తువుల లిస్ట్ రాస్తే సరిపోతుంది.
జాగ్రత్త..
కొత్త ఇంటికి సామాను తీసుకెళ్లగానే సామాను అంతా ఇంట్లో పెట్టడం కామన్. అయితే సామాను ఉన్న బాక్సులను అన్నింటిని ఒకేసారి తెరవకూడదు. ఒక్కొక్క బాక్స్ ను తెరుస్తూ వాటిని ఎక్కడ పెట్టాలో చూసుకుని సర్దుకోవాలి. ఇలా చేస్తే ఎలాంటి గందరగోళం లేకుండా అన్నీ సర్దేసుకోవచ్చు.
గసగసాలు ఇలా వాడితే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం..!
ఈ 9 ఆహారాలు ఎముకలను దారుణంగా దెబ్బతీస్తాయి..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక చేయండి.
Updated Date - May 10 , 2024 | 02:56 PM