Home Making: కుళాయిలు, షవర్ హెడ్స్ పై మురికిని నిమిషాలలో తొలగించే టిప్..
ABN, Publish Date - Oct 21 , 2024 | 04:51 PM
ప్రతి ఇంట్లో కుళాయిలు, షవర్ హెడ్ లు చాలా గార పట్టి దుమ్ము, ధూళి తో మురికిగా కనిపిస్తుంటాయి. వాటిని ఇలా క్లీన్ చేస్త్ మెరుస్తాయి.
ఇప్పట్లో వాటర్ సప్లై మొత్తం పైపుల నుండే.. ఈ కారణంగా ప్రతి ఇంట్లో కుళాయిలు ఉంటున్నాయి. కొందరు షవర్లు కూడా వాడుతుంటారు. వీటిని ఎక్కువ కాలం క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తే మురికి, గార పేరుకుపోయి నీరు సాఫీగా రావడంలో ఆటంకం కలుగుతుంది. అంతేకాదు.. పై నుండి చూడటానికి కూడా బాగా మరకలుగా కనిపిస్తూ ఎబ్బెట్టుగా ఉంటుంది. చాలామంది ఈ సమస్య తొలగించుకోవడం కోసం నిమ్మకాయ, బేకింగ్ సోడా వంటివి వాడుతుంటారు. కానీ వీటిని సింపుల్ గా నిమిషాల్లో తొలగించే టిప్ ఒకటుంది.
పెసర మొలకలు తింటే.. ఈ సమస్యలున్న వారికి నష్టం తప్పదు..
వైట్ వెనిగర్..
వైట్ వెనిగర్ దుకాణాలలో సులభంగానే లభ్యమవుతుంది. సూపర్ మార్కెట్లలో ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. నిమ్మరసానికి బదులు వైట్ వెనిగర్ ను చాలా రకాలుగా వినియోగిస్తుంటారు. వైట్ వెనిగర్ ను ఉపయోగించి షవర్ హెడ్స్, కుళాయిలు ఈజీగా శుభ్రం చేయవచ్చు. వీటిని తళుక్కున మెరిపించవచ్చు.
మొదటగా కుళాయిల పైన వైట్ వెనిగర్ ను స్ప్రే చేయాలి. కుళాయిలను విప్పదీసే వీలుంటే వాటల్ పైప్ వాల్ ను ఆఫ్ చేసి వాటిని విడదీయాలి. ఒక బకెట్ తీసుకుని అందులో నీరు, వైట్ వెనిగర్ వేయాలి. ఇందులో కుళాయిలు మునిగేలా ఉంచాలి. 30 నుండి 40 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత కుళాయిలను బ్రష్ తో రుద్ది కడగాలి. ఇలా చేయడం వల్ల కుళాయిలు తళతళా మెరుస్తాయి. అచ్చం కుళాయిలను క్లీన్ చేసినట్టే షవర్ హెడ్స్ కూడా క్లీన్ చేయవచ్చు. షవర్ హెడ్ ను విడదీసి వెనిగర్ కలిపిన నీళ్లలో వేయాలి. 30 నుంి 40 నిమిషాల తరువాత బ్రష్ తో రుద్ది కడగాలి. ఇలా చేస్తే కుళాయిలు, షవర్ హెడ్స్ తో పాటు ఇతర మెటల్ వస్తువులు కూడా మరకలు, మురికితో పాటు నీటి గార కూడా మాయం అవుతుంది.
ఇవి కూడా చదవండి..
మహిళలు క్రమం తప్పకుండా పాలకూర తింటే జరిగేది ఇదే..!
Blueberry Vs Amla: బ్లూ బెర్రీ లేదా ఉసిరి.. చర్మ ఆరోగ్యానికి ఏ పండు అద్భుతంగా పనిచేస్తుంది..
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 21 , 2024 | 04:51 PM