ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Home Making: కొత్త చీపురుతో అందరూ ఎదుర్కునే సమస్య ఇదే.. ఇల్లంతా దుమ్ము అవుతుంటే ఇలా చేసి చూడండి..

ABN, Publish Date - Nov 13 , 2024 | 08:01 PM

కొత్త చీపురు తెచ్చాక చాలామంది దాన్నుండి రాలిపడే పొట్టుతో ఇబ్బంది పడతారు. కానీ ఈ టిప్స్ పాటిస్తే దాన్ని తొలగించవచ్చు.

ఇంటి శుభ్రత చాలా ముఖ్యమైన పని. రెండు పూటల ఇళ్లు ఊడ్చకుండా ఉంటే చాలు.. ఇల్లంతా ఏదో స్లమ్ ఏరియాలాగా కనిపిస్తుంది. ఇక చిన్న పిల్లలు ఉన్న ఇల్లైతే మరీ అధ్వానంగా ఉంటాయి. అందుకే ఉదయం, సాయంత్రం ఇల్లు ఊడవడం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇల్లు ఊడవడం కోసం కొత్త చీపురు కొనేవారికి కొత్త ఇబ్బంది ఉంటుంది. అదే కొత్త చీపురు నుండి రాలిపడే పొట్టు. రెల్లు పొదల గడ్డితో తయారు చేసే చీపుర్లు కొత్తగా వాడితే వాటి నుండి పొట్టు రాలుతుంది. ఈ సమస్య రాకూడదంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

Calcium: పాల కంటే 8రెట్ల కాల్షియం ఉన్న గింజలు.. రోజూ ఓ స్పూన్ తింటే ఎముకలు ఉక్కులా మారడం ఖాయం..


ఇంటికి కొత్త చీపురు తెచ్చాక దాన్ని వెంటనే ఉపయోగించకూడదు. దాన్ని ఇంటి బయట స్థలం లేదా పెరట్లోకి తీసుకెళ్లి తుడుచుకోవాలి. ఇలా చేస్తే దాని నుండి పొట్టు తొలగిపోతుంది. కొంతమంది చీపురులో ఉన్న పొట్టు తొలగిపోవాలని దాన్ని చాలా గట్టిగా ఊపుతుంటారు. బండకేసి కొడుతుంటారు. ఇలా చేయడం వల్ల చీపురులో ఉన్న కొమ్మలు వదులుగా మారతాయి. చీపురు తొందరగా పాడైపోతుంది.

కొత్త చీపురును నీటిలో నానబెడితే దాని పొట్టు సులభంగా తొలగిపోతుంది. నీళ్లతో నింపిన బకెట్ లో చీపురును ఉంచాలి. పూర్తీగా తడిగా అయ్యాక చీపురును బయటకు తీయాలి. ఇలా రెండు మూడు సార్లు నీళ్లు మార్చి చేయాలి. ఇలా చేసిన తరువాత చీపురును ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేస్తే చీపురులో ఉండే పొట్టు తొలగిపోతుంది.

Cholesterol: ఆయుర్వేదం చెప్పిన చిట్కా.. ఈ పానీయాన్ని తాగితే చాలు.. కొలెస్ట్రాల్ దానంతట అదే తగ్గిపోతుంది..


దువ్వెన ఉపయోగించి కూడా కొత్త చీపురులో ఉండే పొట్టును తొలగించవచ్చు. ఒక దువ్వెన లేదా బట్టలు ఉతికే బ్రష్ కూడా వాడచ్చు. వీటిని ఉపయోగించి కొత్త చీపురును 3 నుండి 4 సార్లు బాగా దువ్వాలి. ఇలా దువ్వితే చీపులో ఉండే పొట్టు లూజ్ గా మారుతుంది. తరువాత చీపురును మెల్లిగా విదిలిస్తే అందులో పొట్టు మొత్తం రాలిపోతుంది.

కొత్త చీపురుకు ఉన్న పొట్టును తొలగించడానికి కొబ్బరినూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చీపురు చుట్టూ 5 నుండి 6 చుక్కల కొబ్బరి నూనె వేయాలి. తరువాత రెండు చేతులతో చీపురును బాగా రుద్దాలి. ఇలా చేసిన తరువాత దువ్వెనతో ఒకటి రెండు సార్లు దువ్వాలి. తరువాత విదిలించాలి. అంతే చీపురులో ఉండే పొట్టు మొత్తం రాలిపోతుంది.

ఇది కూడా చదవండి..

Hair Growth Gummies: మార్కెట్లో ట్రెండ్ అవుతున్న హెయిర్ గ్రోత్ గమ్మీస్.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారుచేసుకోండి..

కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దైవ కృప ఖాయం..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 13 , 2024 | 08:01 PM