ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: సింహాలైనా డోంట్ కేర్.. ఏడు సింహాలకు చుక్కలు చూపించిన రెండు తేనె కుక్కలు.. వీడియో వైరల్..

ABN, Publish Date - Sep 04 , 2024 | 12:18 PM

పాపి కొండల్లో నివసించే అత్యంత అరుదైన జీవి తేనె కుక్క. వీటిని సాధారణంగా హనీ బ్యాడ్జర్స్ అని పిలుస్తుంటారు. ఈ జీవులు గురించి పూర్తి వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చిన్నపాటి ఎలుగుబంట్లను పోలి ఉండే ఈ తేనె కుక్కలు అరిస్తే దాదాపు 30 కిలోమీటర్లు మేర వినబడుతుంది.

Honey Badger

పాపి కొండలతో పాటు ప్రపంచంలో చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే నివసించే అత్యంత అరుదైన జీవి తేనె కుక్క (Honey Badgers). వీటిని సాధారణంగా హనీ బ్యాడ్జర్స్ అని పిలుస్తుంటారు. ఈ జీవులు గురించి పూర్తి వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చిన్నపాటి ఎలుగుబంట్లను పోలి ఉండే ఈ తేనె కుక్కలు అరిస్తే దాదాపు 30 కిలోమీటర్లు మేర వినబడుతుంది. కేవలం 12 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండే ఈ జీవులకు తేనెటీగ లార్వాలంటే ఎంతో ఇష్టం. అందుకే వీటిని తేనె కుక్క లేదా హనీ బ్యాడ్జర్ అని పిలుస్తారు. ఇవి కీటకాలను, పాములను, కుందేళ్లను కూడా తింటాయి. ఇక, పోరాటం, పౌరుషంలో వీటికి సాటి వచ్చే మరో జంతువు లేదనే చెప్పాలి (Viral Video).


ఈ హనీ బ్యాడ్జర్స్‌ను చూసి ఎలుగు బంట్లు, తోడేళ్లు, ఏనుగులు సైతం హడలిపోతాయి. వీటి జోలికి వెళ్లేందుకు భయపడతాయి. అడవిలో క్రూర జంతువులైన సింహం, పులులతో సైతం ఇవి ధైర్యంగా పోరాడతాయి. వీటి చర్మం సాగే గుణం కలిగిన ఎలస్టిక్ తరహాలో ఉంటుంది. వీటిని పాము విషం కూడా ఏమీ చయలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రెండు హనీ బ్యాడ్జర్స్ ఏడు సింహాలకు (Lion) చుక్కలు చూపించాయి. ఆ వీడియోలో హనీ బ్యాడ్జర్స్‌ను చంపేందుకు ఓ సింహం గుంపు ప్రయత్నించింది. అయితే ఆ హనీ బ్యాడ్జర్స్ సింహాలతో ధైర్యంగా పోరాడాయి. వాటిని ఎదురించి ప్రాణాలను దక్కించుకున్నాయి.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 7 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 5 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``హనీ బ్యాడ్జర్స్ ఎంత పెద్ద జంతువునైనా ఎదురిస్తాయి``, ``అవి చనిపోయే వరకు పోరాటాన్ని ఆపవు``, ``వాటి ధైర్యం చూస్తే భయపడాల్సిందే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువైతే.. ఈ ఫొటోలోని తేడాగా ఉన్న అమ్మాయి మొహాన్ని కనిపెట్టండి..


Viral Video: అందమే కాదు.. ధైర్యం కూడా ఈమె సొత్తే.. భారీ సర్పాన్ని పట్టుకుని ఈమె ఏం చేసిందో చూడండి..


Viral Video: ఈ మ్యాచ్‌ను దేవుడు కూడా ఎంజాయ్ చేస్తాడట.. కామెంటరీ వింటే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే..


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వరద నీటిలో మొసళ్ల బీభత్సం.. ఇది వడోదరలో చిత్రీకరించిందేనా?


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2024 | 12:18 PM

Advertising
Advertising