ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Titanic: టైటానిక్ మునిగినపుడు ఎంత చలి ఉండేది.. ఒళ్లు గగుర్పొడిచే ఆ అనుభవం కావాలంటే అక్కడకు వెళ్లాల్సిందే..

ABN, Publish Date - Sep 17 , 2024 | 05:25 PM

ఎముకలు కొరికే చలి అనే మాటను మనం తరచుగా వింటుంటాం. దాదాపు 112 ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ మంచు కొండను ఢీకొట్టి టైటానిక్ ఓడ మునిగిపోయింది. ఆ ఘటనలో సముద్రంలో పడడం కంటే గడ్డ కట్టించే చలి వల్లనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

Titanic Museum in America

ఎముకలు కొరికే చలి (Cold) అనే మాటను మనం తరచుగా వింటుంటాం. దాదాపు 112 ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ మంచు కొండను ఢీకొట్టి టైటానిక్ (Titanic) ఓడ మునిగిపోయింది. ఆ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో సముద్రంలో పడడం కంటే గడ్డ కట్టించే చలి వల్లనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ సినిమాలోని ఆ దృశ్యాలు ఎంతో మందిని కంటతడి పెట్టించాయి. టైటానిక్ ఓడి మునిగినపుడు అక్కడ మైనస్ 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయట (Viral Video).


అలాంటి వాతావరణాన్ని అనుభూతి చెందాలనుకునే వారి కోసం అమెరికాలోని (America) టెన్నసీలో ఉన్న ఓ మ్యూజియం (Museum) నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆ మ్యూజియంలో పూర్తిగా టైటానిక్‌కు సంబంధించిన గుర్తులే ఉంటాయి. దాదాపు 400కు పైగా టైటానిక్ ప్రామాణిక కళాఖండాలతో ఆ మ్యూజియంను నింపేశారు. ఈ మ్యూజియం సందర్శకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. మైనస్ 2 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో ఉంటే ఎలా ఉంటుందో అనుభూతి చెందాలనుకునే వారి కోసం ఓ ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. సందర్శకులు అక్కడ ఏర్పాటు చేసిన టబ్‌లో ఉన్న నీటిలో చేయి పెట్టి సరికొత్త అనుభవాన్ని అందుకుంటున్నారు.


ఆ వాతావరణంలో ఎంత సేపు చేయి పెట్టి ఉంచగలరో టెస్ట్ చేసుకుంటున్నారు. ఆ నీటిలో చేయి పెడితే మంచు కొండను తాకిన అనుభూతి కలుగుతోందని చాలా మంది సందర్శకులు చెబుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 20 లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. 9.3 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. టైటానిక్ ఓడ మునిగినపుడు అందులోని యాత్రికులు ఎంత బాధను అనుభవించి ఉంటారో అంటూ చాలా మంది కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Anand Mahindra: వెనిస్‌లో కూడా ముంబై తరహా ట్రాఫిక్ జామ్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..


Viral Video: పాపం.. హీరోలా దూసుకుపోదాం అనుకున్నాడు.. చివరకు రెండు బస్సులు మధ్య ఇరుక్కున్నాడు..


Viral Video: ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. ట్రాక్టర్ చక్రం లేపుదామనుకున్నాడు.. కాళ్లు పోగొట్టుకున్నాడు..


Optical Illusion: మీ దృష్టి ఎంత షార్ప్‌గా ఉంది?.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న గొడుగును కనిపెట్టండి..



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 05:25 PM

Advertising
Advertising