ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంత చిన్నదో...

ABN, Publish Date - Oct 20 , 2024 | 10:34 AM

రూబిక్స్‌ క్యూబ్‌ రంగులను ఒకవైపు చేర్చడం అందరికీ ఓ సరదా. అయితే అది అందరికీ సాధ్యపడదు. దానికి కూసింత తెలివి, ఓర్పు అవసరం. సాధారణంగా రూబిక్స్‌ క్యూబ్‌ అరచేతిలో పట్టేంత ఉంటుంది. అలాంటిది దాని పరిమాణంలో వెయ్యోవంతు అంటే... వేలి గోరుపై నిలిపేంత బుల్లి క్యూబ్‌ను సాల్వ్‌ చేయడమంటే మాటలా?

జపనీస్‌ బొమ్మల కంపెనీ ‘మెగా హౌస్‌’ అతి చిన్న రూబిక్స్‌ క్యూబ్‌ని తయారుచేసి రికార్డు సృష్టించింది. 0.33 గ్రాములున్న ఈ మినీ క్యూబ్‌ను అధునాతన మెటల్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి... సుమారు రెండేళ్లపాటు శ్రమించి తయారుచేసింది. దీని ధర అక్షరాలా రూ. 4.4 లక్షలు. 1974లో జనాదరణ పొందిన త్రీ- డైమెన్షనల్‌ పజిల్‌ ఆవిష్కరణ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా దీన్ని రూపొందించారట.

ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న రూబిక్స్‌ క్యూబ్‌గా ఇటీవల గిన్నిస్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించింది. ఈ మినీ క్యూబ్‌ను సొంతం చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం సంస్థ తమ సొంత వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్స్‌ను తీసుకోవడం ప్రారంభించింది. 2025 ఏప్రిల్‌ నాటికి వీటిని డెలివరీ చేసే అవకాశం ఉందట. ఈ మినీ క్యూబ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవ్వడంతో... ‘దీనిని చేతులతో కాకుండా పట్టకారుతో సాల్వ్‌ చేయాలేమో...’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 10:34 AM