Holi: హోలీ రంగులను తొలగించుకునే ఈజీ చిట్కాలు!
ABN, Publish Date - Mar 25 , 2024 | 09:29 AM
నేడు (మార్చి 25న) దేశవ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగ హోలీ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఈర్ష్య, ద్వేషాలను మరచి ఒకరికొకరు రంగులు, గులాల్‌లు పూసుకుంటారు. దీంతోపాటు ప్రత్యేక వంటకాలను కూడా తయారు చేసుకుంటారు. అయితే కఠినమైన హోలీ రంగులను ఎలా తొలగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
నేడు (మార్చి 25న) దేశవ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగ హోలీ(Holi) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఈర్ష్య, ద్వేషాలను మరచి ఒకరికొకరు రంగులు, గులాల్‌లు పూసుకుంటారు. దీంతోపాటు ప్రత్యేక వంటకాలను కూడా తయారు చేసుకుంటారు. అయితే హోలీ ఆడిన క్రమంలో కొన్ని రంగులు శరీరం, ముఖానికి అంటుకుని నీటితో కడిగినా కూడా సరిగా పోవు. అలాంటి మొండి రంగులను(Colours) ఎలా తొలగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
రంగులతో ఆడుకునే ముందు మీ ముఖం, శరీరానికి కొబ్బరి లేదా ఆవాల నూనె రాసుకుంటే ఆ తర్వాత రంగులు ఈజీగా తొలగిపోతాయి.
హోలీ ఆడుతున్నప్పుడు చేతులకు ఫుల్ హ్యాండ్స్ లేదా నిండు బట్టలు ధరించండి, కొంత వరకు రంగులతో ఉపశమనం లభిస్తుంది.
ముఖం రంగు రాకుండా కాపాడుకోవాలంటే చర్మంపై ఆర్గానిక్ క్రీమ్స్ రాసుకోవాలి. ఇది రంగును వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
చర్మంలోని రంగును పోగొట్టాలంటే పెరుగులో చిటికెడు పసుపు కలిపి చర్మానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
మీ శరీరం నుంచి హోలీ రంగును తొలగించడానికి మీరు శనగ పిండి, పసుపును కూడా ఉపయోగించవచ్చు. ఇందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి రాసుకోవాలి. దీన్ని అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత కడగాలి.
హోలీ రంగులను తొలగించడానికి, మీరు దోసకాయను తురుము, దాని రసాన్ని కూడా తీసుకోవచ్చు. తర్వాత అందులో కొద్దిగా రోజ్ వాటర్, వెనిగర్ మిక్స్ చేసి ఆ పేస్ట్ ని చేతులు లేదా కాటన్ సహాయంతో ముఖం మొత్తం మీద అప్లై చేయండి. దీన్ని అప్లై చేసిన 10 నుంచి 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.
హోలీ శాశ్వత రంగులను చర్మం నుంచి మాత్రమే కాకుండా జుట్టు నుంచి కూడా తొలగించడానికి మీరు అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. దీన్ని నేరుగా మీ ముఖంపై అప్లై చేసి 10 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసి ముఖం కడుక్కోవాలి. రంగును తొలగించడానికి ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Video: హోలీ సందర్భంగా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో 'భస్మ హారతి'
Updated Date - Mar 25 , 2024 | 09:31 AM