ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Super Overs: అసలు సిసలు థ్రిల్లింగ్ మ్యాచ్ అంటే ఇది.. ఒక మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు..

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:48 PM

సాధారణంగా టీ20 క్రికెట్లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. చివరి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుంటుంది. నరాలు తెగే ఉత్కంఠను అందిస్తూ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటాయి.

Maharaja T20

సాధారణంగా టీ20 క్రికెట్లో (T20 Cricket) మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. చివరి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుంటుంది. నరాలు తెగే ఉత్కంఠను అందిస్తూ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటాయి. చివరకు మ్యాచ్ టై అయితే ఫలితాన్ని తేల్చేందుకు ఇరు జట్లతోనూ సూపర్ ఓవర్ (Super Over) వేయిస్తారు. కొన్ని సార్లు ఫలితం కోసం రెండు సూపర్ ఓవర్లు (Three Super Overs) వేయిస్తుంటారు. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఫలితం కోసం ఏకంగా మూడు సూపర్ ఓవర్లు వేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలు సిసలు కిక్ అందించింది.


కర్ణాటక ప్రీమియర్ లీగ్ అయిన ``మహారాజా టీ20 ట్రోఫీ`` (Maharaja T20)లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లీ టైగర్స్ జట్లు తలపడ్డాయి (Hubli Tigers vs Bengaluru Blasters). ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బెంగళూరు బ్లాస్టర్స్ కూడా 20 ఓవర్లలో 164 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఈ సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు సమానంగా పదేసి పరుగులు చేయడంతో రెండో సూపర్ ఓవర్ ఆడక తప్పలేదు. ఈ ఓవర్లో కూడా ఇరు జట్లూ సమానంగా ఎనిమిదేసి పరుగులు చేసి సమానంగా నిలిచాయి.


రెండో సూపర్ ఓవర్లోనూ ఫలితం తేలకపోవడంతో మూడో సూపర్ ఓవర్‌కు వెళ్లకతప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 12 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హుబ్లీ తొలి ఐదు బంతుల్లో 9 పరుగులే చేసింది. అయితే చివరి బంతికి హుబ్లీ ఆటగాడు మన్వంత్ కుమార్ ఫోర్ కొట్టి 13 పరుగులతో జట్టును గెలిపించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో మ్యాచ్ ఫలితం కోసం మూడు సూపర్ ఓవర్లను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి..

Shikhar Dhawan: క్రికెట్‌కు వీడ్కోలు


Paralympics : ఈ స్టార్ల ప్రతిభకు పసిడి పంటే!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 24 , 2024 | 12:48 PM

Advertising
Advertising
<