Viral Video: నిద్రపోతున్న వ్యక్తికి షాకింగ్ అనుభవం.. కళ్లు తెరవగానే భారీ కొండచిలువను చూసి అతడేం చేశాడంటే..
ABN, Publish Date - Jul 19 , 2024 | 02:48 PM
పాములంటే ఈ ప్రపంచంలో చాలా మంది భయపడతారు. ఇక, కొండచిలువలను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. సాధారణంగా పాములంతా తరచుగా కొండ చిలువలు జనావాసాలు లోనికి రావు. అయితే చెట్లు కొట్టేయడం, ఆహార లభ్యత లేకపోవడంతో కొండచిలువలు కూడా అటవీ సమీప గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.
పాములంటే (Snakes) ఈ ప్రపంచంలో చాలా మంది భయపడతారు. ఇక, కొండచిలువలను (Pythons) చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. సాధారణంగా పాములంతా తరచుగా కొండ చిలువలు జనావాసాలు లోనికి రావు. అయితే చెట్లు కొట్టేయడం, ఆహార లభ్యత లేకపోవడంతో కొండచిలువలు కూడా అటవీ సమీప గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది (Python Videos). నిద్రపోతున్న వ్యక్తి కళ్లు తెరిచి చూసి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరిగెత్తాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
danilson_batista అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన ఇంట్లో నేల మీద పరుపు వేసుకుని దాని మీద నిద్రపోయాడు. బయటి నుంచి ఓ కొండచిలువ ఆ గదిలోకి ప్రవేశించింది. ఆ వ్యక్తి పైకి ఎక్కింది. మంచి నిద్రలో ఉన్న ఆ వ్యక్తి తన మీద ఏదో బరువైన వస్తువు పడడంతో నిద్ర నుంచి మేల్కొన్నాడు. కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా భారీ కొండ చిలువ కనిపించింది. ఒక్క క్షణం తన కళ్ల ముందు ఏముందో గమనించి షాకైన ఆ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కణ్నుంచి పరిగెత్తాడు.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా వీక్షించారు. 23 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ``మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి``, ``ఈ వీడియో నిజమైనదేనా?``, ``నిద్ర లేచిన వ్యక్తికి అంత కంటే భయంకర అనుభవం ఉండదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 19 , 2024 | 02:48 PM