ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: యూపీ నుంచి బీహార్‌కు.. లారీ బానెట్ తెరిచి చూసిన కార్మికులకు దిమ్మదిరిగే షాక్..

ABN, Publish Date - Dec 02 , 2024 | 07:14 AM

పాములు ఉన్నాయని తెలిస్తే అటు వెళ్లడానికి కూడా వణికిపోతారు. ఇక, కొండచిలువను చూస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది కొండచిలువతో కలిసి 90 కిలోమీటర్లకు పైగా ప్రయాణి చేసినట్టు తెలిస్తే ఎలా ఉంటుంది. ఆ యూపీ వాసులకు అలాంటి పరిస్థితే ఎదురైంది.

Truck

సాధారణంగా పాములంటే (Snake) ప్రతి ఒక్కరూ భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటు వెళ్లడానికి కూడా వణికిపోతారు. ఇక, కొండచిలువను (Python) చూస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది కొండచిలువతో కలిసి 90 కిలోమీటర్లకు పైగా ప్రయాణి చేసినట్టు తెలిస్తే ఎలా ఉంటుంది. ఆ యూపీ (UttarPradesh) వాసులకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ట్రక్కు (Truck) బానెట్ ఓపెన్ చేసి చూసిన వారికి దిమ్మదిరిగే షాక్ ఎదురైంది. లోపల భారీ కొండచిలువ వారికి కనిపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pro.facts అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆ ట్రక్కు లగేజీ తీసుకుని ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ నుంచి బీహార్‌ (Bihar)లోని నార్కతియాగంజ్‌కు చేరుకుంది. అక్కడ కార్మికులు ట్రక్కు బానెట్ ఓపెన్ చేయగా లోపల భారీ కొండచిలువ కనిపించింది. పది అడుగుల పొడవున్న ఆ భారీ కొండచిలువ ఇంజిన్ పక్కన నక్కి కూర్చుని ఏకంగా 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దానిని చూసిన కార్మికులు షాకయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని దానిని సురక్షితంగా బయటకు తీశారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ కొండచిలువను వదిలేశారు.


ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ``కొండచిలువ తన ప్రయాణానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంది``, ``చాలా పెద్ద ప్రమాదం తప్పింది``, ``అంత వేడిలో అంత సేపు ఆ కొండచిలువ అక్కడ ఎలా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమెను పెళ్లి చేసుకుంటే అప్పులన్నీ మాయం.. పెళ్లిలో వధువుకు వచ్చిన నగదు బహుమతులు చూస్తే..


Viral Video: ట్రైన్ తలుపు నుంచి వింత శబ్దాలు.. వాటిని ఆపేందుకు ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..


Chennai: తుఫాన్ ఎఫెక్ట్.. చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అయోమయం.. తిరిగి గాల్లోకి లేచిన విమానం..


Viral Video: అచ్చం మనిషిలాగానే పరిగెడుతున్న కోతి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 02 , 2024 | 07:14 AM