ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఉద్యోగం వదిలేసి పిల్లలను చూసుకోమన్న భర్త.. భార్య పెట్టిన కండీషన్‌కు నివ్వెరపోయిన భర్త!

ABN, Publish Date - Jun 28 , 2024 | 04:16 PM

గృహిణిగా ఉండడం, పిల్లలను చూసుకోవడం వంటి బాధ్యతలతో సాధారణంగా మహిళలు తమ కెరీర్ విషయంలో రాజీ పడుతుంటారు. ముఖ్యంగా పిల్లలు పుట్టాక ఉద్యోగాలు మానేసే మహిళలు ఎంతో మంది ఉంటారు. భర్త లేదా అత్తమామల ఒత్తిడి వల్లే ఉద్యోగాలు మానేసే మహిళలు ఎంతో మంది ఉంటారు.

wife and husband

గృహిణిగా ఉండడం, పిల్లలను చూసుకోవడం వంటి బాధ్యతలతో సాధారణంగా మహిళలు తమ కెరీర్ విషయంలో రాజీ పడుతుంటారు. ముఖ్యంగా పిల్లలు పుట్టాక ఉద్యోగాలు (Job) మానేసే మహిళలు ఎంతో మంది ఉంటారు. భర్త లేదా అత్తమామల ఒత్తిడి వల్లే ఉద్యోగాలు మానేసే మహిళలు ఎంతో మంది ఉంటారు. ఆ తర్వాత ఆర్థిక స్వాతంత్ర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భర్త (Husband) ఆమెను ఉద్యోగం మానెయ్యమన్నాడు. చాలా రోజులు ఆలోచించిన ఆమె ఓ షరతు విధించింది (Viral News).


ఆమె తన నిర్ణయాన్ని రెడ్డిట్ ద్వారా పంచుకుంది. ఉద్యోగం వదిలేసి పిల్లల బాగోగులు చూసుకోవాలని తన భర్త కోరుకుంటున్నట్లు ఆ మహిళ రెడ్డిట్‌లో పోస్ట్ చేసింది. ``మేం ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. ఇంకొకరు జన్మించబోతున్నారు. నేను గృహిణిగా ఉండాలని, ఉద్యోగం మానేయాలని నా భర్త కోరుకుంటున్నాడు. అతను బాగా సంపాదిస్తున్నాడు కాబ్టటి నేను ఉద్యోగం మానెయ్యడం మా కుటుంబానికి, పిల్లలకు మంచిదని వివరించాడు. కానీ, నాకు భయం వేసింది. మేం భవిష్యత్తులో విడాకులు తీసుకుంటే నాకు ఏ భరోసా ఉండదు. అందుకే కొన్ని వారాలు ఆలోచించాను`` అంటూ ఆ మహిళ పేర్కొంది.


``నేను ఉద్యోగం మానెయ్యడానికి అంగీకరించాను. అయితే అందుకు అతడు తన కంపెనీలో సగం వాటా నాకు ఇవ్వాలని షరతు పెట్టాను. అది విని అతడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఉద్యోగం మానేసి నేను ఇంట్లో ఉంటాను. అవసరమైనపుడు నాకు ఉద్యోగం లభించే అవకాశాలు తక్కువ. అప్పుడు నేను, నా పిల్లలు కష్టాలు పడాల్సి వస్తుంది. మా వివాహం సజావుగా సాగితే ఏమీ ఇబ్బంది లేవు. ఒకవేళ విడిపోతే కంపెనీలో వచ్చే వాటాతో మేం ఆర్థికంగా సురక్షితంగా ఉంటాం`` అని ఆ మహిళ పేర్కొంది. ఆ మహిళ నిర్ణయం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. ``సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును కోరుకునే హక్కు భార్యకు కూడా ఉంటుంద``ని ఒకరు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ``థాంక్యూ సర్`` అనడమే ఆమె చేసిన తప్పు.. ఏకంగా విమానం నుంచి దించేసిన సిబ్బంది.. అసలేం జరిగిందంటే..


Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ నుంచి గాలి వేడిగా వస్తోందా? మీరు చేస్తున్న మిస్టేక్ ఇదే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 28 , 2024 | 04:16 PM

Advertising
Advertising