ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రూ.వెయ్యి ఇచ్చి మరీ భార్య చేత పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..!

ABN, Publish Date - Aug 14 , 2024 | 11:12 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా ఉంటే, మరికొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరదాగా సాగే ఫన్నీ వీడియోలకు మంచి ఆదరణ లభిస్తోంది.

Husband and wife funny video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా ఉంటే, మరికొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరదాగా సాగే ఫన్నీ వీడియోలకు (Funny Video) మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా అలాంటిదే ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేం. manishavikram అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి ఇంట్లో కూర్చుని ఉంది. భర్త (Husband) ఆమె దగ్గరకు ఓ గ్లాస్‌తో పాలు (Milk) తీసుకెళ్లి.. తాగాలని అడిగాడు. అందుకు ఆ యువతి (Wife) నిరాకరించింది. తనకు పాలు అంటే ఇష్టం ఉండదని, తాను తాగనని చెప్పింది. ఆ పాలు తాగితే వెయ్యి రూపాయలు బహుమతిగా ఇస్తానని చెప్పడంతో ఆమె అంగీకరించింది. గ్లాస్‌లోని పాలు సగం తాగింది. కేవలం పాలు తాగడానికి రూ.వెయ్యి ఎందుకు ఇచ్చావని అడిగింది. అప్పుడు ఆ భర్త అసలు విషయం చెప్పాడు.


ఈ రోజు నాగ పంచమి అని, పాము (Snake) చేత పాలు తాగిస్తే మంచి జరుగుతుందని పండిట్ చెప్పాడని అసలు విషయం చెప్పాడు. ఆ విషయం విన్న భార్య సీరియస్ అయ్యింది. పాలు, డబ్బులు కింద పెట్టేసింది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పన్నీ వీడియోకు దాదాపు కోటి వ్యూస్ వచ్చాయి. 8 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ``బ్రదర్.. మీరు మృత్యువుతో ఆడుకుంటున్నారు``, ``వెంటనే అక్కడి నుంచి పారిపోండి`` అంటూ నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral News: అత్తగారి ప్రవర్తనతో అల్లుడు షాక్.. భార్యను, కూతురిని ఇటలీ తీసుకెళ్లి ఏం చేశాడంటే..!


Viral Video: వార్నీ.. ఇంత క్రూరత్వమా.. మ్యాచ్‌లో ఓడిన విద్యార్థులపై టీచర్ ఘాతుకం.. కాలితో తంతూ, బూతులు తిడుతూ..


Picture Puzzle: మీ బ్రెయిన్ ఎంత స్పీడ్‌గా పని చేస్తోందో.. ఈ పజిల్‌ను సాల్వ్ చేస్తే తెలుస్తుంది..!


Viral Video: దీన్ని పిచ్చి అంటారు భయ్యా.. లెహంగా ధరించి రైల్వే స్టేషన్‌లో డ్యాన్స్.. చివర్లో ఏం చేశాడో చూస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2024 | 11:12 AM

Advertising
Advertising
<