ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఆ హైనాకు అర్థమైపోయింది.. సింహాలను చూసి పారిపోకుండా ఉండిపోయింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

ABN, Publish Date - Jul 12 , 2024 | 01:22 PM

సింహం అడవికి రారాజు. సింహానికి ఆకలి వేస్తే అడవిలోని ఎంతటి జంతువునైనా చంపుకుని తినేస్తుంది. ఆకలి మీద ఉన్న సింహం కంటపడితే ఎలాంటి జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అలాంటిది ఒకేసారి రెండు సింహాలు ఎదురుగా వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?

Lions huting Hylena

సింహం (Lion) అడవికి రారాజు. సింహానికి ఆకలి వేస్తే అడవిలోని ఎంతటి జంతువునైనా చంపుకుని తినేస్తుంది. ఆకలి మీద ఉన్న సింహం కంటపడితే ఎలాంటి జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అలాంటిది ఒకేసారి రెండు సింహాలు ఎదురుగా వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? పారిపోయే ప్రయత్నం చేయడం కూడా వృథా ప్రయాసే. తాజాగా సఫారీ టూర్‌‌‌ (Safari Tour)కు వెళ్లిన కొందరు పర్యాటకులు చిత్రీకరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


Latest Sightings అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. ఆ ఛానెల్‌లో కంటెంట్ పోస్ట్ చేసే మారిస్సా వీడ్ తన సఫారీ టూర్‌లో భాగంగా ఈ వీడియోను చిత్రీకరించారు. వీడ్ జీప్‌లో పర్యటిస్తుండగా వారి ఎదురుగా రెండు సింహాలు కనిపించాయి. రోడ్డు పక్కన పొదల్లో ఆ సింహాలకు ఓ ముసలి హైనా (Old Hyena) కనిపించింది. ఆశ్చర్యకరంగా ఆ హైనా తన ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించలేదు. సింహాలను చూసి అలా నిల్చుని ఉండిపోయింది. ఆ రెండు సింహాలు ఆ హైనాను పట్టుకుని చంపేశాయి. ఆ హైనా ఏమాత్రం ప్రతిఘటించలేదు.


అడవిలో సింహాలకు హైనాలు ప్రత్యర్థులు. హైనాలు కూడా బలంగా పోరాడగలవు. అలాంటిది ఈ సందర్భంలో మాత్రం హైనా పోరాడకుండానే ప్రాణాలు వదిలేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``రెండు సింహాల నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని హైనా భావించింది``, ``అది హైనా రిటైర్మెంట్ ప్లాన్``, ``బాధ లేకుండా త్వరగా చనిపోవాలని హైనా నిర్ణయించుకుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ టెక్నిక్ తెలియక పూరీలు చేయడానికి ఎంత టైమ్ వేస్ట్ చేశాం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!


Viral Video: ఏందయ్యా ఇది.. ఎక్కడా చూడలేదు.. పల్సర్ బైక్‌కు ట్రాక్టర్ చక్రం బిగించి ఎంత వేగంగా వెళ్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 12 , 2024 | 01:22 PM

Advertising
Advertising
<