Viral Video: రస్క్ తింటే రిస్క్ ఖాయం.. టీతో పాటు మీరూ రస్క్‌లు తింటారా? ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!
ABN, Publish Date - Aug 11 , 2024 | 03:42 PM
చాలా మంది టీతో పాటు రస్కులు తినేందుకు ఇష్టపడతారు. టీలో ముంచిన బిస్కెట్లు లేదా రస్కులు తినడాన్ని చాలా మంది ఆస్వాదిస్తారు. పిల్లలకు కూడా పాలతో పాటు రస్కులు ఇస్తారు. అలా తినడం వల్ల ఆకలి క్షణాల్లో మాయమవుతుంది. మీకు కూడా రస్కులు తినే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త..
చాలా మంది టీతో పాటు రస్కులు (Rusks) తినేందుకు ఇష్టపడతారు. టీలో ముంచిన బిస్కెట్లు లేదా రస్కులు తినడాన్ని చాలా మంది ఆస్వాదిస్తారు. పిల్లలకు కూడా పాలతో పాటు రస్కులు ఇస్తారు. అలా తినడం వల్ల ఆకలి క్షణాల్లో మాయమవుతుంది. మీకు కూడా రస్కులు తినే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. రస్క్‌ల తయారీకి (Rusk Making) సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు (Viral Video).
dr.poojanpreet అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రస్క్‌ల తయారీని చూపించారు. పిండి, పామాయిల్, చక్కెర వంటి అనారోగ్యకర పదార్థాలతో రస్క్‌లను తయారు చేస్తున్నారు. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో ఈ రస్క్‌లను తయారు చేస్తున్నారు. వాటిని తయారు చేసే వారు కూడా ఎలాంటి గ్లౌస్ ఉపయోగించకుండా, శుభ్రత లేకుండా పని చేస్తున్నారు. ఆ వీడియో చూస్తే ఇకపై రస్క్‌లు తినడానికే భయం వేస్తుంది. ఇలాంటి అనారోగ్యకర రస్క్‌లు పిల్లలకు అస్సలు ఇవ్వకూడదని వీడియోలో పేర్కొన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాదాపు 12 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందనలు తెలియజేశారు. ``మనం కొని తినగలిగే ఆహార పదార్థం ఏదైనా ఉందా``, ``బ్రెడ్, రస్క్, బిస్కెట్లు, మ్యాగీలు.. ఏవీ తినకూడదంటున్నారు.. మరి మనం ఏమి తినాలి``, ``అలా అయితే ప్రతి ఇంట్లోని ఓ బేకరీ ఉండాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ ఫొటోలో ఎన్ని ఆవులున్నాయో కనిపెట్టండి.. 10 సెకెన్లలో కనిపెడితే మీరు గ్రేట్..!
Viral Video: నమ్మశక్యం కాని వీడియో.. భారీ పర్వతాలపై చిరుతలు ఎలా గెంతుతున్నాయో చూడండి..!
Viral Video: ప్రాణభయం పొంచి ఉన్నా అదే పరుగు.. మొసలి నోటి నుంచి తాబేలు ఎలా తప్పించుకుందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Aug 11 , 2024 | 03:42 PM