ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Genius: పుట్టుకతో మేధావి కాకపోయినా పర్లా.. ఇలా చేస్తే చాలు.. ఐఎఫ్ఎస్ అధికారి సూచన

ABN, Publish Date - Apr 01 , 2024 | 09:35 PM

పుట్టుకతో మేధావి కాకపోయినా కొన్ని టిప్స్ ఫాలో అయితే టాలెంట్ పెంచుకోవచ్చని చెప్పారు ఐఎఫ్ఎస్ అధికారి హిమాన్షూ త్యాగి

ఇంటర్నె్ట్ డెస్క్: పుట్టుకతో మేధావి ('Born' Genius) కాకపోయినా కొన్ని టిప్స్ ఫాలో అయితే మేధావిగా మారొచ్చని ('Made' Genius) చెప్పారు ఐఎఫ్ఎస్ అధికారి హిమాన్షూ త్యాగి. తన జీవితంలో ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. తనకు ఐఐటీ కోచింగ్ తీసుకునే రోజుల్లో ఎదురైన సంఘటనను ఆయన పంచుకున్నారు. టాలెంట్‌తో పుట్టేవాళ్లకు, కష్టపడి తమని తాము మెరుగుపరుచుకునే వారికి మధ్య తేడాను వివరించారు.

‘‘నేను ఐఐటీ కోచింగ్ తీసుకునే రోజుల్లో ఓ స్టూడెంట్‌కు మేధావిగా పేరుండేది. అతడు పుట్టుకతోనే టాలెంటెడ్ అని అనుకునేవారు. ఓసారి నాకు సబ్జెక్టులో కొన్ని సందేహాలు వస్తే అతడిని వెళ్లి అడిగాను. అతడు మేధావిగా పుట్టలేదని అతడితో మాట్లాడాక నాకు అర్థమైంది. కష్టపడి నైపుణ్యాలు అలవర్చుకుని తనని తాను మెరుగుపరుచుకున్నాడని తెలుసుకున్నాను’’ అని ఆయన తెలిపారు.

Viral: కూతురు లండన్ నుంచి విదేశీ ప్రియుణ్ణి ఇంటికి తీసుకొస్తే..


సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆయన ఐదు టిప్స్ (5 Tips) కూడా షేర్ చేశారు. మొట్టమొదట.. పరిస్థితులను, చుట్టుపక్కల వాళ్లను నిందించకుండా వెంటనే పని ప్రారంభించాలని ఆయన సూచించారు. నిరంతరం ప్రాక్టీస్ చేస్తే..సైన్స్, మ్యాథ్స్ స్పోర్ట్స్‌తో సహా ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని అన్నారు. పనిపై దృష్టి కేంద్రీకరించేలా చుట్టూ వాతావరణాన్ని రెడీ చేసుకోవాలని అన్నారు. ఏకాగ్రత చెదిరే పరిస్థితులకు దూరంగా ఉండాలని చెప్పారు. సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఓ అంశానికి సంబంధించి అన్ని కోణాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

విద్యార్థులు తాము రాసే పరీక్షల్లో క్లిష్ఠత నిరంతరం పెంచుకోవాలని త్యాగీ సూచించారు. అప్పుడే సబ్జెక్టుపై పట్టుపెరుగుతుందని అన్నారు. తనకు తెలిసిన విద్యార్థి వివిధ పుస్తకాల్లోని అడ్వాన్స్‌స్డ్ ప్రశ్నలను సాల్వ్ చేసేవాడని వివరించారు. నిరంతర విద్యార్థిలా కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలని, అప్పుడే ఎంచుకున్న రంగంలో నిష్ణాతులవుతారని పేర్కొన్నారు. ఆయన సూచనలు అనేక మందికి నచ్చడంతో జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Anand Mahindra: ప్రతి సోమవారం ఇలా చేసి చూడండి.. ఆనంద్ మహీంద్రా సలహా వైరల్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 09:51 PM

Advertising
Advertising