Viral: అమ్మకానికి తాజ్‌మహల్, ఎర్రకోట.. వీడు చాలా డేంజర్ గురూ
ABN, Publish Date - Oct 17 , 2024 | 05:42 PM
ఎలాంటి మారణాయుధాలు ఉపయోగించకుండా ప్రజలు కష్టపడి సంపాదించిన నగదును దోచుకోగలే నైపుణ్యం నట్వర్‌లాల్‌కే ఉంది. అతను ఇప్పటివరకు దాదాపు పదిసార్లు జైలు నుండి తప్పించుకుని అతిపెద్ద మోసగాడిగా చరిత్రలో నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: 'అమ్మో ఒకటో తారీఖు' సినిమా చూశారా. అందులో తనికెళ్ల భరణి చేసే వ్యాపారం తెలుసుగా.. అమాయకులను పట్టుకుని ప్రసిద్ధ కట్టడాలను అమ్మేసి సొమ్ము చేసుకుంటాడు. అలా.. బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణను మోసం చేసి చార్మినార్, రవీంద్ర భారతి, అసెంబ్లీ, హైటెక్ సిటీ సైబర్ టవర్స్.. ఇలా ప్రసిద్ధ కట్టడాలన్నింటినీ అమ్మేస్తుంటాడు. డబ్బులు కట్టి మోసపోయామని తనికెళ్ల భరణిని వెతికి బాధితులంతా చితకబాదుతారు. నిజ జీవితంలోనూ అచ్చం అలాంటివాడే ఒకడుండేవాడు. 'నట్వర్‌లాల్' అనే వ్యక్తి కథే ఇది. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా కష్టపడి సంపాదించిన నగదును దోచుకోగలే నైపుణ్యం ఇతడికి ఉండేది. నట్వర్‌లాల్ ఇప్పటివరకు పదిసార్లు జైలు నుండి తప్పించుకుని అతిపెద్ద మోసగాడిగా చరిత్రలో నిలిచాడు.
మోసాలే జీవనాధారం..
బిహార్‌లో జన్మించిన మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవను నట్వర్‌లాల్ అని పిలిచేవారు. అతను తన మోసపూరిత మాటలతో ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ను ఓ విదేశీ బృందానికి అమ్మేశాడు. ఇదొక్కటే కాదండోయ్.. రాష్ట్రపతి భవన్, ఎర్రకోట, పార్లమెంటు భవనాన్ని విదేశీయులకు విక్రయించాడట. అతను తన జీవితంలో చేసిన మోసాలు మరెవ్వరూ చేసి ఉండరు. ఆస్ట్రో హంగేరియన్ విక్టర్ లుస్టిగ్ కూడా ఇలాంటి వాడే. లుస్టిగ్.. ఏకంగా పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను రెండుసార్లు విదేశీయులకు విక్రయించాడు. దీంతో నెటిజన్లు, నట్వర్‌లాల్‌ను విక్టర్ లుస్టిగ్‌తో పోలుస్తున్నారు.
అమాయకులే టార్గెట్..
మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ బాల్యం బిహార్‌లోని సివాన్ జిల్లాలో గడిచింది. అక్కడే ఉండి ఫోర్జరీ సంతకాలు చేయడం, ఇతరులను మోసం చేయడంలో అతను ఆరితేరాడు. ఇదంతా తండ్రికి తెలియడంతో నట్వర్‌లాల్ కోల్‌కతా పారిపోయి వచ్చాడు. కోల్‌కతా వచ్చినా అతడి ఆగడాలు ఆగలేదు. దీంతో పోలీసులు అతన్ని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. నేరపూరిత కుట్ర, ఫోర్జరీకి సంబంధించి అప్పటి IPC సెక్షన్లు 420, 467, 463, 120-B కింద జైలు పాలయ్యాడు. అలా పలుసార్లు పోలీసులకు పట్టుబడ్డా చాకచక్యంగా తప్పించుకోగలిగాడు. ఇప్పటివరకు అతడ్ని ఎవరూ శాశ్వతంగా జైలులో ఉంచలేకపోయారు. అతడి టార్గెట్ అమాయక టూరిస్టులని.. ఒక్క తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మాడని పోలీసులు తెలిపారు. 2009 జులైలో నట్వర్‌లాల్ అనారోగ్యంతో చనిపోయాడు.
BJP: హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 17 , 2024 | 06:08 PM