ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇండోనేషియా ఉట్టి!

ABN, Publish Date - Sep 01 , 2024 | 08:36 AM

శ్రీకృష్ణాష్టమికి ఉట్టి కొట్టే వేడుకలు ఊరూరా జరుగుతాయి. ఇలాంటి ఆటే ఇండోనేషియాలో కూడా కనిపిస్తోంది. అదే ‘పంజత్‌ పినాంగ్‌’. ఆ దేశ సంప్రదాయ క్రీడ ఇది. పోక చెట్ల పై భాగాన్ని కొట్టేసి, జెండా పెడతారు, దాని చుట్టూ చక్రంలాంటిది అమర్చుతారు.

శ్రీకృష్ణాష్టమికి ఉట్టి కొట్టే వేడుకలు ఊరూరా జరుగుతాయి. ఇలాంటి ఆటే ఇండోనేషియాలో కూడా కనిపిస్తోంది. అదే ‘పంజత్‌ పినాంగ్‌’. ఆ దేశ సంప్రదాయ క్రీడ ఇది. పోక చెట్ల పై భాగాన్ని కొట్టేసి, జెండా పెడతారు, దాని చుట్టూ చక్రంలాంటిది అమర్చుతారు. ఈ చక్రం చుట్టూ బహుమతులను వేలాడదీస్తారు. కాస్త సస్పెన్స్‌ కోసం కానుకలన్నింటినీ కవర్లలో పెట్టి మూసేస్తారు. సెల్‌ఫోను, బ్యాగులు, కుక్కర్లు... ఇలా రోజువారీ వ్యవహారాల్లో ఉపయోగపడే వాటినే బహుమతులుగా ఎంపిక చేయడం విశేషం. అంతా ఈజీనే అనుకుంటే పొరపాటే. పోక చెట్ల కాండానికంతా గ్రీజు పూస్తారు. కాబట్టి చాలా జారుడుగా ఉంటుంది. ఎక్కడం కష్టమే.


అయినా ఆటగాళ్లు ‘తగ్గేదేలే’ అంటూ ప్రయత్నిస్తారు. చిటారు వరకూ చేరుకుని బహుమతిని అందుకున్న వాడే విజేత. సాధారణంగా ఆటగాళ్లందరూ గుంపులుగా చేరతారు. ఒక్కో గుంపునకు ఒక అవకాశం మాత్రమే. అందుకే ఎంతో సమన్వయం ప్రదర్శిస్తారు. చెట్టుపొడవూ మానవ స్తంబంగా ఏర్పడి విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రీడ ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. మన ఉట్టికి మాడ్రన్‌ రూపం పంజత్‌ పినాంగ్‌ కాదంటారా?.

Updated Date - Sep 01 , 2024 | 08:36 AM

Advertising
Advertising