ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అబ్బాయిలూ ఇది విన్నారా.. గర్ల్‌ఫ్రెండ్ కావాలంటే గడ్డం పెంచొద్దట..

ABN, Publish Date - Oct 19 , 2024 | 09:09 AM

పురుషులు గడ్డంతో ఉంటేనే బాగుంటారని కొందరు అమ్మాయిలు భావిస్తారు. మరికొందరు అమ్మాయిలు మాత్రం క్లీన్ షేవ్ చేసుకునే అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడతారు. ఎవరి ఇష్టం వారిది. తమ ప్రియురాలో లేదా భార్య ఇష్టాన్ని బట్టి సదరు పురుషుడు గడ్డం విషయంలో నిర్ణయం తీసుకుంటారు.

Indore College girls demand clean-shaved boy friends

అబ్బాయిలు గడ్డంతో (Beard) ఉంటే అందంగా కనబడతారా? గడ్డం లేకపోతే బాగుంటారా? ఇది ఎంతకీ సమాధానం దొరకని డిబేట్. పురుషులు గడ్డంతో ఉంటేనే బాగుంటారని కొందరు అమ్మాయిలు భావిస్తారు. మరికొందరు అమ్మాయిలు మాత్రం క్లీన్ షేవ్ చేసుకునే అబ్బాయిలనే (Beardless boyfriend) ఎక్కువగా ఇష్టపడతారు. ఎవరి ఇష్టం వారిది. తమ ప్రియురాలు లేదా భార్య ఇష్టాన్ని బట్టి సదరు పురుషుడు గడ్డం విషయంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే తాజాగా ఇండోర్‌ (Indore)కు చెందిన కొందరు అమ్మాయిలు అబ్బాయిల గడ్డాన్ని నిరసిస్తూ ఓ ఆందోళన చేపట్టారు. గడ్డం గీసుకునే అబ్బాయిలే కావాలంటూ ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


కృత్రిమ గడ్డం పెట్టుకున్న కొందరు అమ్మాయిలు (Indore College girls) ఇండోర్ వీధుల్లో అబ్బాయిల గడ్డానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతూ ర్యాలీ చేశారు. ఆ అమ్మాయిల చేతుల్లో ఫ్లకార్డులు కూడా ఉన్నాయి. వాటి మీద ``నో క్లీన్ షేవ్.. నో లవ్``, ``గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి``, ``గడ్డాన్ని అయినా వదులుకో లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను అయినా వదులుకో``, ``నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్`` అంటూ ఆ ఫ్లకార్డుల మీద అమ్మాయిలు నినాదాలు రాసుకుని వీధుల్లో తిరిగారు. ఆ అమ్మాయిల నిరసనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ నిరసన కార్యక్రమం ఏదైనా ప్రమోషనల్ స్టంట్ లేదా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చేసి ఉండవచ్చని చాలా మంది భావిస్తున్నారు.


@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది వీక్షించారు. 4.3 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``మా గడ్డం.. మా ఇష్టం``, ``మా గడ్డంతో అమ్మాయిలకు సమస్య ఏంటి``, ``వారానికి ఒకసారైనా మీరు గడ్డం గీసుకోవాలి.. అప్పుడే మీకు, ఎలుగుబంట్లకు తేడా ఉంటుంది``, ``నేను అర్జంటుగా ఇండోర్ వెళ్లాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పాకిస్తాన్‌లో అమ్మాయిలు లేరా? ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పేది వింటే షాక్ అవ్వాల్సిందే..


Optical Illusion: మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువా?.. అయితే ఈ ఫొటోలో వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి..


Viral Video: ఇదెక్కడి వింత బైక్.. బైక్‌కు ట్రాక్టర్ చక్రం అమర్చి రోడ్డుపై రైడ్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..


Viral: బాబోయ్.. అది దెయ్యం ఇల్లా.. ఏలియన్స్ స్థావరమా? అంటార్కిటికా మంచులో భారీ తలుపు.. నెటిజన్ల కామెంట్లు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 19 , 2024 | 05:36 PM