Viral News: పార్ట్‌నర్ కోసం లింగమార్పిడి.. చివర్లో అడ్డం తిరిగిన కథ
ABN, Publish Date - Feb 21 , 2024 | 06:10 PM
ఈ ఆధునిక యుగంలో.. ప్రేమలో సక్సెస్ స్టోరీలకన్నా ఫెయిల్యూర్ కథలే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అందునా.. చీటింగ్ కేసుల సంఖ్య గణనీయంగా ఉంది. ప్రేమ పేరుతో వంచించి, తమ కోరిక తీరిన వెంటనే పార్ట్‌నర్స్‌ని వదిలేస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇండోర్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి తెరమీదకి వచ్చింది. ప్రేమించిన వ్యక్తి కోసం లింగమార్పిడి చేయించుకోగా.. అతడు దారుణంగా మోసం చేశాడు.
ఈ ఆధునిక యుగంలో.. ప్రేమలో సక్సెస్ స్టోరీలకన్నా ఫెయిల్యూర్ కథలే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అందునా.. చీటింగ్ కేసుల సంఖ్య గణనీయంగా ఉంది. ప్రేమ పేరుతో వంచించి, తమ కోరిక తీరిన వెంటనే పార్ట్‌నర్స్‌ని వదిలేస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇండోర్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి తెరమీదకి వచ్చింది. ప్రేమించిన వ్యక్తి కోసం లింగమార్పిడి చేయించుకోగా.. అతడు దారుణంగా మోసం చేశాడు. చివరికి చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో మరోదారి లేక ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఇండోర్‌కు (Indore) చెందిన ఓ వ్యక్తికి (28) మూడు సంవత్సరాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) కాన్పూర్‌కు (Kanpur) చెందిన వైభవ్ శుక్లాతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీళ్లిద్దరు రెగ్యులర్‌గా చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పెళ్లి చేసుకుంటానని శుక్లా హామీ ఇవ్వడంతో.. ఆ వ్యక్తి వెంటనే లింగమార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారాడు. ఆ తర్వాత ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. అయితే.. మోజు తీరాక శుక్లా ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఒకవేళ తన వెంట పడితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించింది.
లింగమార్పిడి తర్వాత తన పార్ట్‌నర్ వైభవ్ శుక్లా తనని మోసం చేశాడని, తన పట్ల అతడు అసహజ చర్యలకు కూడా పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో తాను ఎంతో డబ్బు వెచ్చించి లింగమార్పిడి చేయించుకున్నానని, అతని వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనని మోసం చేయడంతో పాటు వేధింపులకు గురి చేసిన శుక్లాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారుల్ని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్లాపై ఐపీసీ సెక్షన్ 377, 506 కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - Feb 21 , 2024 | 06:10 PM