iPhone Finger: ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటి? దీని వల్ల కలిగే ప్రమాదమెంతంటే..!
ABN, Publish Date - May 16 , 2024 | 12:07 PM
ఇప్పట్లో స్మార్ట్ ఫోన్ వాడకం చాలా విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుండి అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి ప్రజలలో నెలకొంది. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఐఫోన్ ఫింగర్ అనే పదం చాలా వైరల్ అవుతోంది. అసలు ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటి? దీని వల్ల కలిగే ప్రమాదమెంత?
ఇప్పట్లో స్మార్ట్ ఫోన్ వాడకం చాలా విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుండి అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి ప్రజలలో నెలకొంది. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఐఫోన్ ఫింగర్ అనే పదం చాలా వైరల్ అవుతోంది. అసలు ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటి? దీని వల్ల కలిగే ప్రమాదమెంత? తెలుసుకుంటే..
ఐఫోన్ ఫింగర్ అంటే చిటికెన వేలుకు వచ్చే సమస్య. సాధారణంగా ఫోన్ ను చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ బరువు మొత్తం పింకీ వేలు లేదా చిటికెన వేలుపై పడుతుంది. ఫోన్ ను ఎక్కువసేపు పట్టుకోవడం, ఎక్కువరోజులు ఇదే పద్దతి అనుసరించడం వల్ల చిటికెన వేలువై ఒత్తిడి తాలూకు గుర్తు పడుతుంది. ఈ గుర్తునే ఐఫోన్ ఫింగర్ అని అంటారు.
మీకూ నాలుక తెల్లగా ఉంటుందా? దీనికి అసలు కారణాలు ఇవే..!
ఐఫోన్ ఫింగర్ అనేది జబ్బు కాకపోయినప్పటికీ ఇది ఇలాగే కంటిన్యూ కావడాన్ని నివారించాలని వైద్యులు అంటున్నారు. ఫోన్ ను పట్టుకునే విధానం మార్చుకోవడం చాలా ముఖ్యం.
కేవలం ఐఫోన్ ఫింగర్ గురించే కాకుండా సాధారణంగా కూడా ఫోన్ ను ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మోచేతి సమస్యలు, చేతి కండరాలు, చేతివేలి కండరాలు స్పందించే విధానం బలహీనంగా మారడం వంటి సమస్యలు తెలుత్తాయి.
మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ను ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మణికట్టులో నొప్పి, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. అందుకే స్మార్ట్ పోన్ ను నెట్ బ్రౌజింగ్ కోసం కానీ గేమ్స్ ఆడటం కోసం కానీ గంటలు గంటలు పట్టుకోకూడదు.
ఆహారంలో బెల్లం చేర్చుకోవాలని చెప్పే 10 బలమైన కారణాల లిస్ట్ ఇదీ..!
మానసికంగా అలసిపోయినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - May 16 , 2024 | 12:09 PM